Site icon NTV Telugu

Rana – Teja film: 2 భాగాలుగా రానా, తేజ సినిమా?

Rana Teja Movie

Rana Teja Movie

Rana – Teja film to be in 2 parts: నేనే రాజు నేనే మంత్రి తర్వాత రానా దగ్గుబాటి, దర్శకుడు తేజ రెండోసారి కలిసి ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని తేజ డైరెక్టర్ గా దగ్గుబాటి అభిరాం హీరోగా తెరకెక్కిన అహింస సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అధికారికంగా ప్రకటించారు. అయితే ఈ సినిమాను ఆగస్ట్‌లో అధికారికంగా షూటింగ్‌ ప్రారంభడానికి ప్రణాలికలు సిద్దం చేస్తుండగా ఆ సినిమా గురించి మరో ఆసక్తికరమైన అప్‌డేట్ తెర మీదకు వచ్చింది. అదేమంటే టాలీవుడ్ వర్గాల్లో జరుగుతున్న ప్రచారం మేరకు ఈ సినిమాకి రాక్షస రాజా అనే టైటిల్ పెట్టారని, ఈ సినిమాను భారీ స్థాయిలో చిత్రీకరించనున్నారని తెలుస్తోంది. అంతే కాదు రానా నటించబోయే ఈ సినిమాను రెండు భాగాలుగా చిత్రీకరించి రెండు భాగాలుగా విడుదల చేయనున్నట్టు టాక్ వినిపిస్తోంది.

Kamal Haasan: ‘’ప్రాజెక్ట్ కే’’లో కమల్ రోల్ లీక్?

ఈ సినిమాను ఆగస్ట్‌లో పూజా కార్యక్రమాలతో మొదలు పెట్టి షూట్ కూడా అదే నెలలో ప్రారంభించాలని భావిస్తున్నట్టు చెబుతున్నారు. రెండు భాగాలుగా విడుదల చేయడానికి కథ వ్యవధి తగినంత ఉందని తేజ అభిప్రాయపడ్డారని అంటున్నారు. ఇక మొదటి భాగం పెద్ద హిట్ అయితే రెండవ భాగం మంచి బాక్సాఫీస్ అవకాశాలను కలిగి ఉంటుంది కాబట్టి ఇది నిర్మాతలకు కూడా లాభసాటి డీల్ అని భావిస్తున్నారు. ఇక ఈ సినిమాను ఎవరు నిర్మిస్తారు? నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు ఏమీ వెల్లడి కాలేదు కానీ త్వరలో అధికారికంగా ప్రకటించే అవకశం అయితే కనిపిస్తోంది. రానా ఈ మధ్యనే నిఖిల్ స్పై సినిమాలో ఒక అతిధి పాత్రలో కనిపించాడు.

Exit mobile version