Rana Naidu : రానా నాయుడు సిరీస్ అప్పట్లో ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో మనకు తెలిసిందే. వైలెన్స్, రొమాన్స్ అంతకు మించి బోల్డ్, బూతులు ఉండటంతో కొన్ని విమర్శలు కూడా వచ్చాయి. కానీ మంచి క్రేజ్ సంపాదించుకుంది. తాజాగా ఈ సిరీస్ సీజన్-2 వచ్చేసింది. రానా నాయుడు-2 పేరుతో దీన్ని తెరకెక్కించారు. తాజాగా ఈ సిరీస్ టీజర్ ను రిలీజ్ చేశారు. ఇందులో రానా, వెంకటేశ్ యాక్షన్ అదరగొట్టారు. ఈ టీజర్ లో బోల్డ్ నెస్ అనే మాటనే లేదు. కేవలం యాక్షన్ మాత్రమే చూపించారు. సిరీస్ లో ఉందో లేదో తెలియదు గానీ.. టీజర్ లో మాత్రం దాని జోలికి పోకుండా కట్ చేశారు.
Read Also : Bala Veeranjaneya Swamy: ఏ ఒక్క ఉద్యోగిని తొలగించం.. ఎలాంటి బదిలీలు ఉండవు!
ఈ సిరీస్ ను కరణ్ అన్షుమాన్, సుపర్ణ్ వర్మ, అభయ్ చోప్రా సంయుక్తంగా డైరెక్ట్ చేశారు. సుందర్ ఆరోన్ దీనికి నిర్మాతగా వ్యవహరించారు. ఈ నెల 13న నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఇందుకు సంబంధించిన ప్రమోషన్లు కూడా స్టార్ట్ చేశారు. మరి టీజర్ లో ఉన్నట్టే సినిమాలో ఉంటుందా లేదంటే బూతులు, బోల్డ్ నెస్ ఉంటుందా అనేది తెలియాల్సి ఉంది. గతంలో వచ్చిన రానా నాయుడు సిరీస్ లో వెంకటేశ్ లాంటి సీనియర్ హీరో అలాంటి పాత్రలో చేయడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు నెటిజన్లు.
దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ సారి కొన్ని మార్పులు, చేర్పులు చేసినట్టు తెలుస్తోంది. త్వరలోనే వెంకటేశ్, రానా ఈ సిరీస్ ప్రమోషన్స్ లో పాల్గొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. వెంకటేశ్ రీసెంట్ గానే సంక్రాంతికి వస్తున్నాం మూవీతో భారీ హిట్ అందుకున్నాడు. రానా ప్రస్తుతం రెండు సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు.
Read Also : Thug life : థగ్ లైఫ్ నుంచి సెకండ్ సింగిల్ రిలీజ్..
