NTV Telugu Site icon

Rana Daggubati: మరో కొత్త వ్యాపారం మొదలు పెట్టిన రానా..

Untitled Design (45)

Untitled Design (45)

అప్పటి వరకు చిన్న సినిమాలు చేసిన హీరో రానా కెరీర్ ‘బాహుబలి’ తర్వాత మరో లెవెల్ కి వెళ్ళిపోయింది.పాన్ ఇండియా లెవెల్ లో తన విలనిజంతో మంచి క్రేజ్‌ని సంపాదించుకున్నాడు. కానీ ఆ ఫేమ్ తనకు అంతగా వర్కౌంట్ అవ్వలేదు అని చెప్పాలి. బాహుబలి తర్వాత ‘నేనే రాజు నేనే మంత్రి’, ‘అరణ్య’, ‘విరాట పర్వం’, ‘భీమ్లా నాయక్’, ‘బెట్టియాన్’ వంటి వరుస సినిమాలతో వచ్చాడు. వీటిలో కేవలం ‘భీమ్లా నాయక్’ ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమాలు మాత్రమే సూపర్ హిట్ అయ్యాయి. ఇక ప్రజంట్ చాలా సెలెక్టెడ్ గా కథలు ఎంచుకుంటూ వెళ్తున్నాడు. ఇక పోతే రానా కేవలం సినిమాల్లోనే కాదు అతను వ్యాపారాల్లో కూడా తనదైన మార్క్ ను చూపిస్తున్నాడు.

Also Read:Roja: చాలా రోజుల తర్వాత బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చిన రోజా..

ఇక ఇప్పటికే రానా‌కి ఫుడ్ రెస్టారెంట్స్, బార్స్, కాఫీ షాప్స్ ఉండగా.. రీసెంట్ ఆయన తన భార్యతో కలిసి హైదరాబాద్‌లో మరో ఫుడ్ కోర్టుని ఏర్పాటు చేసాడు. దీని డైరెక్టర్ రాజమౌళి సతీసమేతంగా వచ్చి ఓపెన్ చేశాడు. ఇక వీరికి ఎన్ని వ్యాపారాలు ఉంటే ఏం లాభం చెప్పండి.. వారు మొదలేటిన వ్యాపారాలు కూడా వారి స్టేటస్ కి తగ్గట్టు గానే ఉంటున్నాయి. ఇప్పుడు స్టార్ చేసిన ఈ ఫుడ్ కోర్ట్ లో ఐటమ్స్ కొనాలంటే కేవలం సెలబ్రిటీస్ కి మాత్రమే సాధ్యం, సామాన్యులు ఫుడ్ కోర్టు దరిదాపుల్లోకి కూడా వెళ్ళలేరు. ఎందుకంటే అక్కడ  ఒక్క దాని రేటు చూస్తే మతి పోవాల్సిందే నట.  ఇక ఈ వార్త తెలిసిన జనాలు మూతి మీద వేలేసుకుంటున్నారు.