NTV Telugu Site icon

Chiranjeevi: రూ. 200 కోట్లు బడ్జెట్.. కుర్ర హీరో విలన్.. నమ్మేలా ఉందా వశిష్ఠ..?

Chiru

Chiru

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి, వశిష్ఠ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం మెగా 156. యూవీ క్రియేషన్స్ ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఇక ఈ సినిమాలో చిరు సరసన ముగ్గురు కథానాయికలు ఉండనున్నారని సమాచారం. బింబిసార అనే సినిమాతో వశిష్ఠ భారీ విజయాన్ని అందుకున్నాడు. పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా చిరును కట్టిపడేయడంతో ఈ కుర్ర డైరెక్టర్ కు అవకాశం ఇచ్చాడు. అందుకు తగ్గట్టుగానే పోస్టర్స్ లో పంచభూతాలను చూపించి ఆసక్తి కలిగించాడు. ముల్లోకాలను ఏలే వీరుడు గా కనిపించనున్నాడని సమాచారం. ఇక నేడు ఈ సినిమా పూజా కార్యక్రమాలతో సినిమా మొదలయ్యింది. ఇక ఎప్పుడైతే సినిమా మొదలైయ్యిందో అప్పటినుంచి.. సోషల్ మీడియాలో రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి. ఉదయం నుంచి ఈ సినిమాకు సంబంధించిన రెండు రూమర్స్ సోషల్ మీడియా ను షేక్ చేస్తున్నాయి.

Aadikeshava: విజ్జి పాప గ్లామర్ డ్యాన్స్.. ఇరగదీసింది అంతే

అందులో ఒకటి.. ఈ సినిమాను యూవీ క్రియేషన్స్.. దాదాపు రూ. 200 కోట్ల బడ్జెట్ పెడుతుందట. పూర్తిగా సీజీ వర్క్ తో ఈ సినిమా ఉండనుందని టాక్. కేవలం సీజీ కోసమే ఇంత పెడుతున్నారట. ఇప్పటికే రాధేశ్యామ్ కోసం యూవీ రూ. 350 కోట్లు పెట్టి.. దారుణంగా నష్టపోయింది. ఇప్పుడు ఈ సినిమా కోసం రూ. 200 కోట్లు అంటే మాటలు కాదు. ఇక ఇది కాకుండా ఈ సినిమా కోసం ఒక కుర్ర హీరోను విలన్ గా దింపుతున్నారట. అతను ఎవరో కాదు.. మన భల్లాల దేవుడు. అవును.. రానా దగ్గుబాటి.. ఈ చిత్రం చిరుకు ధీటుగా విలనిజాన్ని పండించనున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే రానాను మేకర్స్ అధికారికంగా సినిమాలోకి ఆహ్వానిస్తారని టాక్ నడుస్తోంది. ఇక ఈ రూమర్స్ వింటుంటే.. అభిమానులు మాత్రం ఇవన్నీ నమ్మేలా ఉన్నాయా అని కౌంటర్లు వేస్తున్నారు. మరి ఇందులో నిజమెంత అనేది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేవరకు ఆగాల్సిందే.

Show comments