NTV Telugu Site icon

Rana Daggubati: నేను లేనప్పుడు సాయిపల్లవిని మాట్లాడించారు.. నేను ఉంటే వేరేలా ఉండేది

Rana

Rana

ప్రస్తుతం హీరోయిన్ సాయి పల్లవి వివాదం నెట్టింట వైరల్ గా మారిన విషయం విదితమే.. ఓ యూట్యూబ్ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సాయిపల్లవి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారగా వాటికి అభ్యంతరం వ్యక్తం చేస్తూ భజరంగ్ దళ్ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. ఇక ఈ కేసుపై సాయి పల్లవి స్పందించింది.గురువారం విశాఖపట్టణంలోని ఓ ప్రైవేట్ హోటల్‌లో జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఇది వివాదాలకు సమాధానం చెప్పే వేదిక కాదని, దానికి తగిన సమయం చూసి తానే వివాదంపై క్లారిటీ ఇస్తానని చెప్పుకొచ్చింది. అంతేకాకుండా ప్రస్తుతం నేను ‘విరాట పర్వం’ సినిమా విడుదలవుతున్న ఆనందంలో ఉన్నానని, అందరు సినిమా చూడాల్సిందిగా కోరింది.

ఇక ఈ వివాదంపై హీరో రానా స్పందించాడు. ” నేను లేని సమయంలో సాయి పల్లవిని ఇంటర్వ్యూ కు పిలిచారు. నేను ఉండి ఉంటే ఇక్కడికి వరకు రానిచ్చేవాడిని కాదు. ఇంత పెద్ద ప్రెస్ మీట్ లో వివాదాలు గురించి మాట్లాడలేం.. దానికి ఒక సమయం ఉండాలి.. సినిమా విడుదల తరువాత అన్నింటికి సాయి పల్లవి సమాధానం చెప్తోంది. ఇక ఈ సినిమా ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. ప్రస్తుత సమాజ పరిస్థితులు కూడా ఇందులో కనబడతాయి. జూన్ 17 న అందరూ ఈ సినిమా చూడండి” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

Show comments