రెండేళ్ల తరువాత రానా నటించిన విరాటపర్వం చిత్రానికి మోక్షం లభించింది. వేణు ఉడుగుల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఎట్టకేలకు జూన్ 17 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ చిత్రంలో రానా సరసన సాయి పల్లవి నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడమే కాకుండా భారీ అంచనాలు రేకెత్తించింది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నేడు వరంగల్ లో విరాటపర్వం ఆత్మీయ వేడుక పెడుతూ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించారు. ఈ వేడుకలో రానా మాట్లాడుతూ “ఇందాక తరుణ్ గారు అడుగుతున్నట్లే చాలామంది నన్ను అడుగుతూ ఉండేవారు.
సర్ .. ఈ సినిమా ఎందుకు సర్ .. మీరు చేస్తున్నారు.. పెద్ద యాక్షన్ సినిమా చేయొచ్చు కదా అని.. చాలాసార్లు చాలామంది సినిమాలు ఎందుకు చేస్తారంటే ఇలా చప్పట్లు కోసం, విజిల్స్ కోసం, ఫ్యాన్స్ కోసం.. కానీ ఈసారి నేను ఈ సినిమా ఎందుకు చేసానంటే.. ఆ చప్పట్ల మధ్యలో నిశ్శబ్దంగా కూర్చొని దీనమ్మ ఇది నిజమే కదా అని ఒకడు నమ్మి చూస్తా ఉంటాడు.. ఆ ఒక్కడి కోసం నేను ఈ సినిమా చేశాను. అంత రియల్ గా, అంత అద్భుతంగా వేణు గారు ఈ సినిమాను రచించడం జరిగింది. వేణు గారు చెప్పినట్లు తెలంగాణ లో కట్టెపుల్లను పట్టుకున్నా కవిత్వం వస్తుంది.. అది ముమ్మాటికీ నిజం. ఇలాంటి తెలంగాణ కథలను ఎన్నెన్నో చెప్పదల్చుకున్నాం.. వరంగల్ లో ఎన్నో కథలు.. ఈ సినిమా జూన్ 17 న వస్తుంది.. మీ లవ్ మా అందరికి కావాలి.. థాంక్యూ.. థాంక్యూ వెరీమచ్” అంటూ చెప్పుకొచ్చాడు.
https://www.youtube.com/watch?v=dbDFBWwRg-4
