NTV Telugu Site icon

Rana Daggubati: కన్నుకు, కిడ్నీకి సర్జరీ జరిగింది.. అనారోగ్య సమస్యలపై మొదటిసారి నోరువిప్పిన రానా

Rana

Rana

Rana Daggubati: సాధారణంగా ఇండస్ట్రీలో ఉన్న నటుల కుటుంబంలోని వారసులు చిన్నతనం నుంచి ఆ ఇండస్ట్రీని చూస్తూనే పెరుగుతారు. అందుకే వారికి అందులోనే ఉండాలన్న కోరిక ఉంటుంది. చిన్నతనం నుంచి తాతను, తండ్రిని, బాబాయ్ ను చూసి పెరిగిన రానాకు ముందు ఆ సినిమాను ఎలా నిర్మించాలో నేర్చుకోవాలనే ఆలోచన వచ్చింది. హీరో కన్నా ముందే రానా విఎఫ్ఎక్స్ లో సిద్దహస్తుడని తెలిసిందే. ఆ తరువాత లీడర్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తరువాత హిట్లు, ప్లాప్ లు అని చూడకుండా సినిమాలు చేస్తూ వస్తున్నాడు. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా ఇమేజ్ ను సొంతం చేసుకున్న రానా ఈ మధ్యనే తన బాబాయ్ వెంకటేష్ తో కలిసి రానా నాయుడు అనే సిరీస్ లో నటించాడు. నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్ ను ప్రేక్షకులు బాగానే ఆదరిస్తున్నారు. దగ్గుబాటి నటవారసుడు గా ఎంట్రీ ఇచ్చి.. ఇప్పుడు పాన్ ఇండియా హీరోగా కొనసాగుతున్నాడు. అది గొప్ప విజయం అనుకుంటే.. రానా తన అనారోగ్య సమస్యల నుంచి ఎంతో దైర్యంతో పోరాడి గెలిచాడు. అది అంతకుమించిన విజయమని చెప్పాలి.

Phalana Abbayi Phalana Ammayi Review: ఫలానా అబ్బాయి – ఫలానా అమ్మాయి

2016 లో రానా అనారోగ్య సమస్యలతో పోరాడుతున్నట్లు వార్తలు వచ్చాయి. రానాకు ఒక కిడ్నీ ఫెయిల్ అయ్యింది. అంతేకాదు.. తన కుడికన్ను కూడా సరిగ్గా కనిపించదు. ఈ విషయాల గురించి రానా ఏనాడు నోరు విప్పింది లేదు. అయితే రానా నాయుడు వెబ్ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో తన అనారోగ్యం గురించి, దాన్ని పోరాడి గెలిచిన విధానం గురించి చెప్పుకొచ్చాడు. “కార్నియల్ ట్రాన్స్ ప్లాంట్ గురించి మాట్లాడేవారిలో నేను ఒకడిని.. ఒకరోజు ఒక చిన్నపిల్లాడు తన తల్లికి తన కుడికన్ను కనిపించడం లేదు అని చెప్పి ఏడుస్తున్నాడు. అప్పుడు నేను ఆ పిల్లవాడికి దైర్యం చెప్పాను. నాకు కూడా కుడికన్ను కనిపించాడని చెప్పాను.ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుందని నచ్చజెప్పాను. ప్రతి మనిషి తాను ఒక శారీరక సమస్యతో పోరాడితే.. అది తగ్గిపోయినా కూడా నాకే ఎందుకు ఇలా జరుగుతోంది అని పదేపదే ఆలోచిస్తూ ఉంటాడు. అసలు దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు అని నేను అంటాను. నా కుడికన్ను సరిగ్గా కనిపించదు.. సర్జరీ చేయించుకున్నా.. కిడ్నీ ఫెయిల్ అయ్యింది.. కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్ చేయించుకున్నా.. నిజం చెప్పాలంటే నేనొక టెర్మినేటర్ ను. ఇన్ని చేయించుకున్నా. నేను హ్యాపీగా ఉన్నా. మ్నారి మీరెందుకు అంతలా ఆలోచిస్తారు. ఆలోచించడం మానేసి హ్యాపీగా ఉండండి” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

Show comments