Site icon NTV Telugu

Leader: ఎలక్షన్స్ ముందు ‘లీడర్’ మళ్ళీ దిగుతున్నాడు!

Leader 2

Leader 2

Rana Daggubati Leader Re Releasing on May 9th: దగ్గుబాటి వారసుడిగా రానా హీరోగా ఎంట్రీ ఇస్తూ చేసిన మొదటి సినిమా లీడర్. ఈ సినిమా గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అప్పట్లో అనేక ప్రశంసలు దక్కించుకుంది. రానా హీరోగా నటించిన ఈ సినిమాలో రిచా గంగోపాధ్యాయ, ప్రియా ఆనంద్ హీరోయిన్లుగా నటించారు. రాజకీయాల ద్వారా సేవ చేయాలని ప్రయత్నించిన తన తండ్రి సుమన్ అనూహ్య పరిస్థితుల్లో మరణిస్తే ముఖ్యమంత్రి పీఠాన్ని అర్జున్ పాత్రధారిగా రానా అధిష్టించాల్సి వస్తుంది. ఆ తర్వాత ఎదురైన పరిణామాలు ఏమిటి? తన తండ్రి మీద పడ్డ మరకలను అర్జున్ ఏ విధంగా చెరిపే ప్రయత్నం చేశాడు లాంటి ఆసక్తికరమైన కథాంశంతో ఈ సినిమాను అప్పట్లో తెరకెక్కించారు. ప్రతిష్టాత్మక ఏవీఎం ప్రొడక్షన్స్ సంస్థ ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించింది.

Sonu Sood: పిచ్చండీ ఇది.. సోనూసూద్ కోసం 1500 కి.మీ పరిగెత్తుకొచ్చిన ఫ్యాన్!

ఎలాంటి అసభ్యకరమైన కంటెంట్ లేకుండా కేవలం ప్రజలను ఆలోచింపజేసే విధంగా, ఎన్నికల మీద, లీడర్ల మీద ఒక నిర్దిష్టమైన ఆలోచన ధోరణిని కలగజేసే విధంగా ఈ సినిమా ఉంటుంది. ఈ సినిమాని ఇప్పుడు సరిగ్గా ఎన్నికలకు నాలుగు రోజుల ముందు రీ రిలీజ్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు మే 9వ తేదీన సినిమాని రీ రిలీజ్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలతో పాటు తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు మే 13వ తేదీన జరగబోతున్నాయి. ఎలక్షన్ మూమెంట్ కాబట్టి కొత్త సినిమాలను రిలీజ్ చేసే విషయంలో ఒకటికి రెండుసార్లు దర్శక నిర్మాతలు ఆలోచించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ రీ రిలీజ్ సినిమాలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ఇప్పటికే మే ఒకటో తేదీన వకీల్ సాబ్ సినిమాతో పాటు ప్రభుదేవా ప్రేమికుడు సినిమా కూడా రిలీజ్ అవుతోంది. సరిగ్గా ఎన్నికల ముందు లీడర్ కూడా రిలీజ్ కాబోతూ ఉండడం హాట్ టాపిక్ అవుతోంది.

Exit mobile version