Rana Daggubati Gives Clarity On Miheeka Pregnancy News: గత కొన్ని రోజుల నుంచి రానా దగ్గుబాటి, మిహీకా బజాజ్ దంపతులు పేరెంట్స్ కాబోతున్నారని తెగ ప్రచారం జరుగుతోంది. ఇటీవల సోషల్ మీడియాలో తాను షేర్ చేసిన ఫోటోల్లో మిహీకా కాస్త బొద్దుగా కనిపించడమే వల్లే.. ఈ రూమర్స్ తెరమీదకి వచ్చాయి. దీంతో.. రానా దంపతుల నుంచి ఇంకా అధికార ప్రకటన రాకముందే మిహీకా గర్భం దాల్చిందని, త్వరలోనే ఆ జంట దంపతులు కానున్నారనే వార్తలు ఊపందుకున్నాయి. దీనికితోడు.. రీసెంట్‌గా ఒక పాపను ఎత్తుకున్న ఫోటోని మిహీకా నెట్టింట్లో షేర్ చేయడంతో, పరోక్షంగా మిహీనా ప్రెగ్నెంట్ అయినట్టు హింట్ ఇచ్చిందని అంతా అనుకున్నారు. ఈ నేపథ్యంలోనే రానా దంపతులకు అందరూ అభినందనలు తెలిపారు. గాయని కనికా కపూర్ కూడా ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేసింది.
దీంతో.. ఈ వార్తలపై స్పందించేందుకు రానా ముందుకొచ్చాడు. తాను తండ్రి కాబోతున్నానని వస్తున్న వార్తల్లో ఏమాత్రం వాస్తవం లేదని రానా క్లారిటీ ఇచ్చాడు. తన భార్య మిహీకా గర్భవతి కాదని స్పష్టం చేశాడు. ఈ వార్తలు ఎక్కడి నుంచి పుట్టుకొచ్చాయో అర్థం కావట్లేదని రానా వెల్లడించాడు. దాంతో.. రానా దంపతులు పేరెంట్స్ కానున్నట్టు నెట్టింట్లో వస్తున్న వార్తలకు చెక్ పడినట్టయ్యింది. కాగా.. కొంతకాలం డేటింగ్ చేసిన అనంతరం కరోనా సమయంలో 2020 ఆగస్టు 8వ తేదీన రానా, మిహీకా వివాహం చేసుకున్నారు. కొందరు కుటుంబ సభ్యుల సమక్షంలో వీరి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. పెళ్లి అయినప్పటి నుంచి రానా, మిహీకా సోషల్ మీడియాలో చాలా తక్కువగా కనిపిస్తున్నారు. రానా పాన్ ఇండియా నటుడు కావడంతో.. తన సినిమాలకు సంబంధించిన అప్డేట్స్‌ని మాత్రమే నెట్టింట్లో ఇస్తున్నాడు.