Site icon NTV Telugu

Rana Daggubati : అర్జున్ ప్రసాద్ నుంచి డేనియల్ శేఖర్… 12 ఏళ్ళు

Rana

టాలీవుడ్ హల్క్ రానా దగ్గుబాటి సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి నేటితో 12 ఏళ్ళు పూర్తవుతోంది. అర్జున్ ప్రసాద్ నుంచి డేనియల్ శేఖర్ వరకు ఆయన ప్రయాణం అద్భుతమని చెప్పాలి. సరిగ్గా 12 సంవత్సరాల క్రితం డైరెక్టర్ శేఖర్ కమ్ముల మూవీ “లీడర్‌”లో యువ రాజకీయ నాయకుడు అర్జున్ ప్రసాద్‌గా వెండితెరపైకి వచ్చిన రానా ఆ తరువాత పలు సూపర్ హిట్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరించారు. ‘బాహుబలి’తో భళ్లాలదేవుడిగా ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్న రానా కేవలం హీరోగానే కాకుండా మల్టీస్టారర్ చేయడానికి కూడా ఆసక్తిని కనబరుస్తారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో కలిసి చేస్తున్న “భీమ్లా నాయక్”తో ఈ నెల 25 నుంచి థియేటర్లను దడలాడించడానికి సిద్ధంగా ఉన్నాడు రానా.

Read Also : Ester Noronha : కమిట్మెంట్ అడిగారు, బెదిరించారు… అదే జీవితం కాదు

12 ఏళ్ల సినీ కెరీర్ ను పూర్తి చేసుకున్న సందర్భంగా రానా సోషల్ మీడియాలో “అద్భుతమైన 12 సంవత్సరాలు!! అందరి శుభాకాంక్షలకు ధన్యవాదాలు!! అర్జున్ ప్రసాద్ నుండి డానియల్ శేఖర్ వరకు… మధ్యలో ఉన్న ప్రతి ఒక్కరికీ, నన్ను ఆదరించినందుకు అందరికీ ధన్యవాదాలు… కొత్త విషయాలను కనుగొంటూ, మీకు కొత్త కథలు, పాత్రలను అందిస్తూనే ఉంటాను!!” అంటూ హృదయపూర్వక నోట్ ను రాసుకొచ్చారు. ఇక ఆయన భార్య మిహికా కూడా ‘లీడర్’ నుండి రానా పోస్టర్‌ను షేర్ చేస్తూ, “12 ఇయర్స్ ఆఫ్ ఎక్సలెన్స్” అంటూ భర్తకు శుభాకాంక్షలు తెలిపింది.

Exit mobile version