NTV Telugu Site icon

Dulquer Salmaan: ‘కాంత’గా దుల్కర్ సల్మాన్..నిర్మాతగా రానా

Kaantha

Kaantha

Rana Daggubati and Dulquer Salmaan Join Hands for ‘Kaantha’ : ఈ రోజు దుల్కర్ సల్మాన్ పుట్టిన రోజు కావడంతో ఆయన నటిస్తున్న సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ ఒక్కటొక్కటిగా వస్తున్నాయి. ఇప్పటికే ఆయన హీరోగా ‘లక్కీ భాస్కర్’ అనే సినిమాను ప్రకటించిన తరువాత ఇప్పుడు మరో ఆసక్తికరమైన ప్రాజెక్టుకి సంబంధించిన ప్రకటన వచ్చేసింది. ఆయన సురేష్ ప్రొడక్షన్స్ అధినేత సురేష్ బాబు కుమారుడు, బాహుబలి ఫేమ్ దగ్గుబాటి రానాతో ‘కాంత’ అనే సినిమా చేయనున్నారు. ఈ సినిమాలో దుల్కర్ హీరోగా నటించనుండగా దుల్కర్ నిర్మాతగా వ్యవహరించనున్నారు. ఇక దుల్కర్ ఈ ‘కాంత’ సినిమాలో హీరోగా నటించనుండగా రానా నిర్మాతగా వ్యవహరించనున్నారు. ఇక ఈ సినిమాలో ఆయన గతంలో ఎన్నడూ నటించని పాత్రలో కనిపించనున్నాడని అంటున్నారు. ఆయన స్పిరిట్ మీడియా బ్యానర్ తో కలిసి తన వేఫేరర్ ఫిల్మ్స్ ద్వారా ఈ చిత్రాన్ని నిర్మిస్తాడని అంటున్నారు.

Rohit Sharma: ఏడో స్థానంలో రోహిత్ బ్యాటింగ్.. ఎప్పుడు వచ్చాడంటే..?

ఈ చిత్రానికి సంబంధించిన కథాంశాలు ప్రస్తుతానికి గోప్యంగా ఉంచబడినప్పటికీ, 2016లో ‘నిల’తో తొలిసారిగా అరంగేట్రం చేసి ‘లైఫ్ ఆఫ్ పై’లో అంగ్ లీకి సహాయ సహకారాలు అందించిన సెల్వమణి సెల్వరాజ్ ‘కాంత’కు దర్శకత్వం వహించనున్నారని తెలుస్తోంది. ఇవి మాత్రమే కాకుండా సెల్వమణి నెట్‌ఫ్లిక్స్ లో త్వరలో రిలీజ్ అవుతున్న డాక్యుమెంటరీ సిరీస్ ‘హంట్ ఫర్ వీరప్పన్’కి కూడా దర్శకత్వం వహించాడు. దుల్కర్ సల్మాన్ మలయాళ చిత్ర పరిశ్రమ నుండి వచ్చినప్పటికీ, ఇతర భాషా పరిశ్రమలలో కూడా చాలా పేరు తెచ్చుకున్నాడు. ‘బెంగళూరు డేస్’, ‘కురుప్’, ‘ఓ కాదల్ కన్మణి’, ‘కార్వాన్’, ‘సీతా రామం’, ‘చుప్’ వంటి హిట్లు కొట్టిన ఆయన ఈసారి పాన్ ఇండియా అప్పీల్ తో వస్తున్నాడు. ఈ కాంత సినిమా కూడా పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ కానుంది.