Site icon NTV Telugu

Rana: లవ్ మౌళిలో రానా.. అందుకే దాచాం!

Love Mouli

Love Mouli

Rana Acted in Love Mouli as Aghora: నవదీప్ సరికొత్త అవతార్‌లో న‌వ‌దీప్ 2.Oగా క‌నిపించ‌బోతున్న చిత్రం ‘లవ్,మౌళి’. ఈ విభిన్న‌మైన, వైవిధ్య‌మైన చిత్రానికి ఎస్.ఎస్. రాజమౌళి శిష్యుడు అవ‌నీంద్ర ద‌ర్శ‌కుడు. ఇప్పటికే ఈ సినిమా ప్రచార చిత్రాలు, ప్రమోషన్‌ కంటెంట్‌ సినిమాపై ఆసక్తిని పెంచగా… నైరా క్రియేషన్స్ మరియు శ్రీకర స్టూడియోస్ బ్యానర్స్‌తో క‌లిసి టాలీవుడ్ టాలెంటెడ్ టెక్నిషియన్స్‌కి అడ్డాగా మారిన సి స్పేస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇటీవల సింగిల్‌ కట్‌ లేకుండా సెన్సారును పూర్తిచేసుకున్న ఈ చిత్రం సెన్సార్ నుండి ‘ఏ’ సర్టిఫికెట్‌ను సొంతం చేసుకుంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని జూన్‌ 7న గ్రాండ్‌గా విడుదలకు సిద్ధమైన ఈ చిత్ర విశేషాలను హీరో న‌వ‌దీప్ మీడియాతో షేర్ చేశారు.

Pawan Kalyan: భార్య పిల్లలతో కలిసి మెగాస్టార్ ఇంటికి పవన్ కళ్యాణ్

అదేమంటే ఈ సినిమాలో ఒక అఘోరా పాత్రలో రానా నటించాడు. ఆ విషయం సినిమా రిలీజ్ అయ్యే వరకు అసలు బయటపెట్టలేదు సినిమా యూనిట్. ఈ విషయాన్ని గురించి నవదీప్ ను అడిగితే స‌ర‌దాగా హీరో రానాకు క‌థ చెప్పాను. క‌థ బాగుంద‌ని చెప్పి ఈ సినిమాలో రానా అఘోరాగా ఒక ముఖ్య‌పాత్ర‌ను చేశాడు. అంతేకాదు నా కోసం ఎదైనా చెయ్యాల‌ని చెప్పి రానా ఈ పాత్ర‌ను చేశాడు. నిజంగా చెప్పాలంటే రానాకు ఈ పాత్ర చేయ‌డం అవ‌స‌రం లేదు. నాతో వున్న స్నేహంతో పాటు పాత్ర చేశాడు. ఈ రోజు వ‌ర‌కు కూడా రానా ఈ చిత్రం చేశాడ‌ని రివీల్ చేయ‌లేదు. ఎందుకంటే దీనిని క‌మ‌ర్షియ‌ల్‌గా వాడుకోవడం ఇష్టం లేదు. ఈ సినిమాలో ఈ పాత్ర‌ను రానా చేయ‌క‌పోతే మా ద‌ర్శ‌కుడు చేసేవాడు అని అన్నారు.

Exit mobile version