Ramyakrishna : ఎవర్ గ్రీన్ హీరోయిన్ రమ్యకృష్ణకు ఉన్న పాపులారిటీ అంతా ఇంతా కాదు. అప్పట్లో హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది. ఇప్పటికీ ఆమె చేస్తున్న పాత్రల్లో ఒదిగిపోయి తన గ్రేస్ చూపిస్తోంది. అలాంటి రమ్యకృష్ణ తాజాగా జగపతి బాబు హోస్ట్ గా చేస్తున్న జయమ్ము నిశ్చయమ్మురా షోకు గెస్ట్ గా వచ్చింది. ఇందులో అనేక విషయాలను పంచుకుంది. ఈ క్రమంలోనే రమ్యకృష్ణ, సౌందర్య కలిసి నటించిన నరసింహా సినిమా వీడియోలను జగపతి బాబు స్క్రీన్ మీద చూపించారు. ఆ వీడియో చూస్తున్నంత సేపు రమ్యకృష్ణ కళ్లలో నీళ్లు తిరిగాయి. సౌందర్యను తలచుకుని చాలా ఏడ్చేసింది రమ్యకృష్ణ. సౌందర్య తనకు ఎంతో మంచి ఫ్రెండ్ అని చెప్పుకొచ్చింది.
Read Also : Rithika Nayak : రితిక నాయక్ ఘాటు సొగసులు చూశారా
సౌందర్య చాలా చిన్న స్థాయి నుంచి వచ్చింది. తనను తాను మలుచుకుని ఎవర్ గ్రీన్ స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఆమె ఎదుగుదలలోనే కాదు వ్యక్తిత్వంలోనూ ఎంతో గొప్పగా ఆలోచిస్తుంది. ఆమె నాకు మంచి ఫ్రెండ్. ఇద్దరం కలిసి ఎన్నో సార్లు బయటకు వెళ్లేవాళ్లం. అమ్మోరు సినిమాలోనే ఆమెను మొదటిసారి కలిశాను. ఒక పాత్ర కోసం ఏం చేయడానికైనా ఆమె సిద్ధంగానే ఉంటుంది. ఆమె నుంచి నేను చాలా విషయాలు నేర్చుకున్నాను అంటూ చెప్పుకొచ్చింది రమ్యకృష్ణ. నరసింహా సినిమాలో సౌందర్య ముఖంపై కాలు పెట్టే సీన్ చేసేటప్పుడు చాలా ఇబ్బంది పడ్డాను. కానీ ఆ సీన్ కోసం సౌందర్య ఒప్పుకోవడమే చాలా గొప్ప విషయం అని తెలిపింది రమ్యకృష్ణ.
Read Also : Samantha : సమంత హీరోల సరసన నటించడం కష్టమేనా..?
