Censor Board Shock to Ramgopal Varma’s Vyuham Movie: డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ వ్యూహం సినిమా ఇబ్బందుల్లో పడింది. దివంగత నేత వైఎస్.రాజశేఖరరెడ్డి మరణాంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పడిన పరిస్థితుల ఆధారంగా వ్యూహం సినిమా తెరకెక్కిస్తున్నట్టు ప్రకటించిన వర్మ వ్యూహం సినిమాను నవంబర్ 10 న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్టు కూడా ప్రకటించాడు. తాజాగా ఈ సినిమాను సెన్సార్ కోసం పంపించగా సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వడానికి బోర్డు నిరాకరించింది. ఈ క్రమంలో రామ్ గోపాల్ వర్మ మీడియా ముందుకు వచ్చారు. సెన్సార్ సర్టిపికెట్ ఇవ్వడానికి సెన్సార్ బోర్డు నిరాకరించిందని, ఇప్పటికే రివైజింగ్ అప్లై చేశామని కూడా వివరించారు. అయితే అరచేతిని అడ్డుపెట్టి సూర్యుడిని ఆపలేరని చెబుతున్న రామ్ గోపాల్ వర్మ ఇంకా ఏమేం మాట్లాడుతున్నారో ఒకసారి వినేయండి
RGV Vyuham: అరచేతిని అడ్డుపెట్టి సూర్యుడిని ఆపలేరు అంటున్న రామ్ గోపాల్ వర్మ

Rgv Vyuham Press Meet