NTV Telugu Site icon

Ramarao On Duty: రవితేజ ‘రామారావు ఆన్ డ్యూటీ’ ట్విట్టర్ టాక్ ఏంటి?

Rama Rao On Duty

Rama Rao On Duty

Ramarao On Duty Twitter Talk:మాస్ మహారాజా రవితేజకు ఇటీవల కాలంలో సరైన హిట్ లేదు. 2021 సంక్రాంతికి వచ్చిన క్రాక్ మంచి వసూళ్లను సొంతం చేసుకుంది. అయితే ఈ ఏడాది ఫిబ్రవరిలో వచ్చిన కిలాడీ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో రవితేజ లేటెస్ట్ మూవీ రామారావు ఆన్ డ్యూటీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, రవితేజ టీం వర్క్స్ బ్యానర్ సంయుక్తంగా నిర్మించిన ఈ మూవీకి యంగ్ డైరెక్టర్ శరత్ మండవ దర్శకత్వం వహించాడు. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ మంచి బజ్‌ను క్రియేట్ చేసింది. ఈ మూవీలో రవితేజ సరసన దివ్యాంశ కౌశిక్‌, రజిషా విజయన్ హీరోయిన్‌లుగా నటించారు. ఈరోజే విడుదలైన ఈ మూవీ గురించి సోషల్ మీడియాలో నెటిజన్‌లు ఏమనుకుంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.

Read Also: Gold Prices: శ్రావణ మాసం ఎఫెక్ట్.. భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

రవితేజకు మరోసారి హిట్ వచ్చిందని కొందరు అంటుంటే.. రవితేజ హిట్ కోసం మరికొంతకాలం వెయిట్ చేయాలని మరికొందరు కామెంట్ చేస్తున్నారు. ఈ సినిమాలో మాస్ డైలాగ్స్, రవితేజ నటన, స్టోరీ, ప్రొడక్షన్ వాల్యూస్, బీజీఎం బాగున్నాయని.. సాంగ్స్, స్క్రీన్‌ప్లే బాగోలేదని ట్విట్టర్‌లో సినిమా చూసిన వాళ్లు పోస్ట్ చేస్తున్నారు. కొందరు మూవీ యావరేజ్‌గా ఉందని.. ఓ సారి లుక్ వేయవచ్చని చెప్తున్నారు. రవితేజ ఇంట్రడక్షన్ బాగుందని.. ఫస్టాఫ్‌లో కథలో కొత్తదనం లేదని కొందరు నెటిజన్‌లు అభిప్రాయపడుతున్నారు.