NTV Telugu Site icon

Ramam Raghavam: ఆలోచింప చేసేలా “తెలిసిందా నేడు” సాంగ్

Ramam Raghavam Song

Ramam Raghavam Song

Ramam Raghavam Telugu Movie Telisinda Nedu Lyrical Video: పృథ్వి పొలవరపు నిర్మాణంలో స్లేట్ పెన్సిల్ స్టోరీస్ బ్యానర్ పై ప్రభాకర్ ఆరిపాక సమర్పణలో తెరకెక్కుతున్న ద్విభాషా చిత్రం “రామం రాఘవం”. నటుడు ధనరాజ్ కొరనాని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ప్రముఖ నటుడు సముద్రఖని ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. గురుపూజోత్సవం సందర్భంగా ఈ మూవీ నుంచి ‘తెలిసిందా నేడు’ పాటను దర్శకుడు సుకుమార్ విడుదల చేశారు. ఎమోషనల్ గా సాగే ఈ మెలోడీ సాంగ్ ఆలోచింపచేసేలా ఉంది. తండ్రి కొడుకు మధ్య ఉండే ఎమోషన్ ను కరెక్ట్ గా కాప్చర్ చేస్తూ చిత్రీకరించిన ఈ సాంగ్ కి అరుణ్ చిలువేరు సంగీతం అందించగా రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు.

HIT The 3rd Case: గెట్.. సెట్.. గో.. అర్జున్ సర్కార్ గా నాని అదుర్స్..

ఇక ఈ సినిమాలో మోక్ష, హరీష్ ఉత్తమన్,సునీల్, సత్య, పృద్వి, శ్రీనివాసరెడ్డి, చిత్రం శ్రీను, ప్రమోదిని, రాకెట్ రాఘవ, రచ్చ రవి, ఇంటూరి వాసు, తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి విమానం దర్శకుడు శివ ప్రసాద్ యానాల కథ ను అందించగా అరుణ్ చిలువేరు సంగీతం సమకూర్చారు మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటర్, దుర్గా ప్రసాద్ ఈ సినిమాకు కెమెరామెన్. రామం రాఘవం సినిమాలోని పాటలను అన్నిటినీ రామజోగయ్య శాస్త్రి రాశారు, హైదరాబాద్, అమలా పురం, రాజమండ్రి, రాజోలు, చెన్నై పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకున్న ‘రామం రాఘవం’ తమిళ తెలుగు భాషలలో ఒకేసారి త్వరలో విడుదల కానుంది.

Show comments