Ramam Raghavam Teaser Released కమెడియన్ ధనరాజ్ డైరెక్టర్ గా మారి చేసిన ద్విభాషా చిత్రం “రామం రాఘవం”. స్లేట్ పెన్సిల్ స్టోరీస్ బ్యానర్ పై ప్రభాకర్ ఆరిపాక సమర్పణలో పృథ్వి పోలవరపు నిర్మాణంలో సముద్రఖని ప్రధాన పాత్రలో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా టీజర్ ఈరోజు రిలీజ్ ఐడి. చెన్నైలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రముఖ దర్శకుడు బాలా, పాండిరాజ్, సముద్రఖని, నటులు బాబీ సింహా, తంబి రామయ్య, నటులు సూరి,దీపక్ ,హరీష్ తదితరులు పాల్గొన్నారు. ఇక తండ్రీ కొడుకుల సెంటిమెంట్ తో ఈ సినిమా ఆసక్తి రేకెత్తిస్తోంది. ఇక ఈ క్రమంలో దర్శకుడు ధనరాజ్ మాట్లాడుతూ రచయిత శివప్రసాద్ కథ ఇది. ఈ కథ గురించి ఖని అన్నకి చెప్పా, కథను నువ్వే డైరెక్ట్ చేయాలిని చెప్పాడు. నేను నటించిన చిత్రాలకు పనిచేసిన దర్శకుల నుండి నేను నేర్చుకున్న విషయాల ఆధారంగా నేను దర్శకత్వం వహించా. ఇప్పటి వరకు 100 చిత్రాల్లో నటించా, ఆ సినిమా దర్శకులు అందరూ నా గురువులే.
Varun Tej: పిఠాపురంలో వరుణ్ తేజ్ ప్రత్యేక పూజలు
వారు నేర్పిన పాఠాలతో ఈరోజు దర్శకుడిగా మారా, సముద్రఖని అన్న లేకుంటే ఈ సినిమా పూర్తయ్యేది కాదు, నేను దర్శకుడిని అయ్యే వాడిని కాను. అందరూ వాళ్ళ నాన్నతో కలిసి ఈ సినిమా చూడాలని ధనరాజ్ పేర్కొన్నారు. సముద్రఖని మాట్లాడుతూ… సంతోషకరమైన సమయం ఇది. నేను తండ్రిగా దాదాపు 10కి పైగా సినిమాల్లో నటించా, ఒక్కొక్కటి విభిన్న కథతో. అలాంటి మరో కొత్త కథ ఇదన్నారు. ధనరాజ్ కి తల్లిదండ్రులు లేరు. స్వతహాగా ఎదిగి ఈ స్థాయికి చేరుకున్నాడు. మంచి కథ ఇది, అందుకు తగ్గ దర్శకుడు ఉండాలని అనుకున్నా. ధనరాజ్ పై నాకు పెద్ద నమ్మకం ఉంది. అందుకే, అతన్నే దర్శకత్వం చేయమని చెప్పా. దర్శకుడిగా అతను పెద్ద విజయాన్ని అందుకుంటాడు, తండ్రీ కొడుకుల మధ్య ఉండే బంధాన్ని చాటే చిత్రం ఇది. నిర్మాతను నేనెప్పుడూ కలవలేదు, చిత్రీకరణ సమయంలో మొదటిసారి చూశా, సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. తప్పకుండా విజయం సాధిస్తుందని చెప్పారు.