Site icon NTV Telugu

వివాదంపై స్పందించిన సింగర్ సునీత భర్త

singer sunitha

singer sunitha

సింగర్ సునీత భర్త రామ్ వీరపనేని ఒక డిజిటల్ మీడియా కంపెనీకి అధినేతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. సదరు సంస్థ తెలుగు సినిమాలు డిజిటల్ రైట్స్ కొని వాటిని యూట్యూబ్ వేదికగా విడుదల చేస్తూ ఉంటుంది. అయితే ఇటీవల అలా కొనుగోలు చేసి విడుదల చేసిన ఒక సినిమాలోని సన్నివేశంలో గౌడ కులానికి చెందిన మహిళలను ఇబ్బందికర పరిస్థితుల్లో చూపించారు అంటూ గౌడ సంఘానికి చెందిన కొంతమంది రామ్ ఆఫీస్ కి వెళ్లి, అతనితో వాగ్వాదానికి దిగిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే ఈ విషయం మీద ఇరువర్గాల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన ఇప్పటి దాకా వెలువడ లేదు. కానీ తాజాగా ఈ విషయం మీద మ్యాంగో సంస్థ నుంచి అధికారిక ప్రకటన వెలువడింది.

Read Also : దేవుడిపై అనుచిత వ్యాఖ్యలు… చిక్కుల్లో హీరోయిన్

జనవరి 24న కొంతమంది వ్యక్తులు తాము గౌడ కులానికి చెందిన వాళ్లమని, ఒక సినిమా గురించి కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ, ఆ కంటెంట్ ను యూట్యూబ్ నుంచి తొలగించాలని వారు కోరినట్లుగా ప్రకటనలో పేర్కొన్నారు. సదరు సినిమా ఇప్పటికే సెన్సార్ సర్టిఫికేట్ ద్వారా థియేటర్లలో విడుదలై, ఆ తర్వాత యూట్యూబ్ లో అందుబాటులోకి వచ్చినప్పటికీ, స్త్రీలను కించపరుస్తూ చూపించే ఉద్దేశం లేకపోవడంతో వారు చెప్పిన రోజునే దానిని యూట్యూబ్ నుంచి తొలగించామని ప్రకటనలో పేర్కొన్నారు. అయితే ఆ వీడియో కారణంగా ఎవరి మనోభావాలను అయినా పొరపాటున నొప్పించి ఉంటే భేషరతుగా క్షమాపణ తెలియజేస్తున్నాము అంటూ ప్రకటనలో పేర్కొన్నారు.

Exit mobile version