NTV Telugu Site icon

Adipurush: ఈ పాటతో ఏడిపించేలా ఉన్నాడు భయ్యా…

Adipurush

Adipurush

శ్రీ రాముడు, జానకి కథలో భరించలేని బాధ ఉంటుంది. ముఖ్యంగా రావణుడు సీతాదేవిని అపహరించి లంకలో బందించినప్పుడు… రాముడు సీత కోసం వెతికే ప్రయాణంలో ఉండే బాధ ఎన్ని రామాయణాలు రాసినా వర్ణించడం కష్టమేమో. మహారాణిగా కోటలో ఉండాల్సిన సీత, లంకలో అశోకవనంలో రాముడి కోసం ఎంత ఎదురు చూసిందో వాల్మీకీ రామాయణం చదివితే తెలుస్తుంది. ఇప్పుడు దర్శకుడు ఓం రౌత్ కూడా సీతా రాముల మానసిక వ్యధని తెరపై చూపించబోతున్నాడు. ఆదిపురుష్ సినిమాలో ‘రామ్ సీతా రామ్’ పాటతో ఆడియన్స్ ని కంట తడి పెట్టించబోతున్నాడు. జూన్ 16న థియేటర్స్ లో కూర్చున్న ఆడియన్స్ ని ఓం రౌత్ ‘రామ్ సీత రామ్’ పాటతో ఏడిపించడం గ్యారెంటీగా జరిగేలా ఉంది. ఈ పాట లిరికల్ వీడియో బయటకి వచ్చి, సెన్సేషనల్ వ్యూస్ తో పాటు అందరి నుంచి హార్ట్ టచింగ్ కాంప్లిమెంట్స్ అందుకుంటూ ఉంది.

రాముడు సీతాదేవి మధ్య ఉన్న అనుబంధాన్ని రెండు డైలాగ్స్ తో చెప్పే ప్రయత్నం కూడా ఈ పాటలో జరిగింది. రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ ని ఇకపై శ్రీరామ నవమి పండగ ఎప్పుడు జరిగినా ఇదే పాట వినిపించే అంత గొప్పగా రాసాడు. హిందీ, తెలుగు, తమిళ్, కన్నడ, మళయాల భాషల్లో ఈ సాంగ్ ని సచేత్ – పరంపర కంపోజ్ చెయ్యడంతో పాటు వారే పాడడం విశేషం. రోజు రోజుకి అంచనాలు పెంచుతూ పోతున్న ఆదిపురుష్ టీమ్, జూన్ 6న తిరుపతిలో గ్రాండ్ ప్రీరిలీజ్ ఈవెంట్ చెయ్యడానికి రెడీ అవుతున్నారు. ఈ ఈవెంట్ తో ఆదిపురుష్ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకడం గ్యారెంటీ. వంద్ కోట్ల ఓపెనింగ్ డే కలెక్షన్స్ తో పాటు ఓవరాల్ రన్ లో ప్రభాస్ కి మరో వెయ్యి కోట్ల సినిమాగా ఆదిపురుష్ కనిపిస్తోంది.