NTV Telugu Site icon

Skanda: ఏజెంట్ బాటలో స్కంద… చాలా చెప్పారు కానీ కొంచమే చేస్తున్నారు

Skanda

Skanda

అక్కినేని అఖిల్ నటించిన లాస్ట్ సినిమా ‘ఏజెంట్’. స్టైలిష్ స్పై యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమా ముందుగా పాన్ ఇండియా మూవీగా అనౌన్స్ అయ్యింది. సురేందర్ డైరెక్షన్, అఖిల్ స్టైలిష్ స్పై అనగానే ఏజెంట్ సినిమాపై అంచనాలు పెరిగాయి. దీనికి తోడు ఏజెంట్ సినిమా గ్లిమ్ప్స్ బయటకి వచ్చి సినిమాపై అంచనాలని మరింత పెంచేసింది. తీరా రిలీజ్ అయ్యి బిగ్గెస్ట్ హిట్ అవుతుంది అనుకుంటే వాయిదా పడుతూ వచ్చి పాన్ ఇండియా రిలీజ్ నుంచి కేవలం తెలుగు రిలీజ్ కి మాత్రమే పరిమితం అయ్యింది. మల్టీలాంగ్వేజ్ రిలీజ్ అనుకోని లాస్ట్ కి సింగల్ లాంగ్వేజ్ కి స్టిక్ అయ్యింది చిత్ర యూనిట్. ఇప్పుడు ఇదే దారిలో నడుస్తున్నట్లు ఉంది స్కంద సినిమా. రామ్ పోతినేని హీరోగా, బోయపాటి శ్రీను డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా ‘స్కంద’. ఈ మూవీ అనౌన్స్మెంట్ నుంచే డిఫరెంట్ కాంబినేషన్ అనే పేరు తెచ్చుకుంది. గ్లిమ్ప్స్ తో మంచి ఎక్స్పెక్టేషన్స్ కూడా క్రియేట్ అయ్యాయి.

ఊర మాస్ పాన్ ఇండియా సినిమాని చూడబోతున్నాం అనే ఫీలింగ్ లో ఉన్న సినీ అభిమానులు స్కంద సినిమా కోసం వెయిట్ చేస్తూనే ఉన్నారు. రిలీజ్ డేట్ ప్రీపోన్ పోస్ట్ పోన్ అవుతూ స్కంద మూవీ సెప్టెంబర్ 28న రిలీజ్ కానుంది. సలార్ వాయిదా పడడంతో ఆ డేట్ కి దిగుతున్న స్కంద సినిమా ప్రమోషన్స్ ఆశించిన స్థాయిలో బజ్ జనరేట్ అవ్వట్లేదు. రిలీజ్ మరో వారం రోజులు ఉంది కానీ చిత్ర యూనిట్ ఇంకా బయటకి వచ్చి ఎక్కడా కనిపించట్లేదు. తెలుగులోనే పరిస్థితి ఇలా ఉంటే ఇక ఇతర భాషల్లో స్కంద ప్రమోషన్స్ ఎలా జరుగుతున్నాయో అర్ధం చేసుకోవచ్చు. పాన్ ఇండియా సినిమా చేయాలి, పాన్ ఇండియా హిట్ కొట్టాలి అంటే ప్రమోషన్స్ ని కూడా పాన్ ఇండియా స్థాయిలోనే చేయాలి. స్కంద సినిమా విషయంలో సాంగ్స్, పోస్టర్స్, ట్రైలర్స్ ఇతర భాషల్లో కూడా వస్తున్నాయి కానీ ప్రమోషన్స్ మాత్రం జరగట్లేదు.