Site icon NTV Telugu

Vyooham Trailer: వర్మ ఎవరినీ వదిలిపెట్టలేదు… అన్ని పుస్తకాలు చదివిన మనిషికి ఆలోచన ఉండదా?

Vyooham Trailer

Vyooham Trailer

సంచలనాత్మక దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నుంచి మరో సెన్సేషన్ సినిమా రాబోతుంది. దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం నుంచి ప్రస్తుత ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ వరకూ సీఎమ్ జగన్ మోహన్ రెడ్డి జీవితంలో జరిగిన సంఘటన నేపథ్యంలో ‘వ్యూహం’ అనే సినిమాని తెరకెక్కిస్తున్నాడు రామ్ గోపాల్ వర్మ. రెండు భాగాలుగా రిలీజ్ కానున్న ఈ మూవీ నుంచి మొదటి పార్ట్ నవంబర్ 10న ఆడియన్స్ ముందుకి రానుంది. ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన వర్మ… వ్యూహం ట్రైలర్ ని లాంచ్ చేసాడు. వర్మ నుంచి పొలిటికల్ సినిమా వస్తుంది అంటే అందులో ఎన్ని కాంట్రవర్సీ విషయాలు ఉంటాయో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అయితే సినిమాలో ఎంత ఉందో ఎంత సెన్సార్ అవుతుందో తెలియదు కానీ వ్యూహం సినిమా ట్రైలర్ మాత్రం పీక్స్ లో ఉంది.

ఏపీ పాలిటిక్స్ ని హీట్ ఎక్కించేలా ఉన్న ట్రైలర్ లో వర్మ… పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడుని టార్గెట్ చేస్తూ సీన్స్ పెట్టాడు. డైలాగ్స్ కూడా వాళ్లని టార్గెట్ చేసేలానే ఉన్నాయి. వైఎస్ భారతి క్యారెక్టర్ ప్లే చేసిన హీరోయిన్ మానస ఒక సీన్ లో “రెండు లక్షల పుస్తకాలు చదివిన మనిషికి ఆ మాత్రం ఆలోచన ఉండదా” అనే డైలాగ్ చెప్తుంది. ఈ ఒక్క డైలాగ్ చాలు ట్రైలర్ లో వర్మ ఎవరిని ఎంత టార్గెట్ చేసాడో చెప్పడానికి. ట్రైలర్ ఎండ్ లో స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ గురించి కూడా సీన్ పెట్టిన వర్మ… వ్యూహం ట్రైలర్ తో నిజంగానే ఏపీలో హీట్ పెంచాడు. రావాలి జగన్, కావాలి జగన్ సాంగ్ ని కూడా సినిమా కోసం వాడేసాడు ఆర్జీవీ. షాట్ ఫ్రేమింగ్, ఇంటెన్సిటీ కంప్లీట్ గా వర్మ స్టైల్ లోనే ఉంది.  ముఖ్యమంత్రి జగన్ పాత్రలో అజ్మల్ పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాడు. మరి నవంబర్ 10న వ్యూహం సినిమా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

https://twitter.com/RGVzoomin/status/1712724970185560252

Exit mobile version