NTV Telugu Site icon

Ram Gopal Varma: సీఎం జగన్‌కు రాంగోపాల్ వర్మ బహిరంగ లేఖ

Rgv

Rgv

Ram Gopal Varma Writes a open letter to AP CM Ys Jagan: ఏపీ మంత్రి ఆర్కే రోజాపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన టీడీపీ నేత బండారు సత్యనారాయణను అనకాపల్లిలో పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ అరెస్ట్ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ బహిరంగ లేఖ రాశారు. ఏపీ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా సెల్వమణి పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ పై జగన్ సర్కారు తీసుకున్న చర్యలను ఆర్జీవీ అభినందిస్తూ ఇలాంటి నాయకులపై పార్టీలతో సంబంధం లేకుండా చర్యలు తీసుకోవాలని ఎక్స్ (ట్విట్టర్)లో కోరారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వానికి పలు సూచనలు కూడా చేశారు రామ్ గోపాల్ వర్మ. ‘’చంపుతా, బట్టలిప్పి నిలబెడతా, గొంతు కోస్తా లాంటి రెచ్చగొచ్చే మాటలు, నిరాధార ఆరోపణలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించిన వర్మ ప్రజలు ప్రభావితమయ్యేలా తప్పుడు సమాచారం, హానికరమైన అబద్ధాలను ప్రచారం చేసే వారిని అస్సలు ఉపేక్షించొద్దు” అని వర్మ తన బహిరంగ లేఖలో పేర్కొన్నారు.

Ram Charan: అయ్యప్ప మాలలో రామ్ చరణ్.. ఫొటోలు వైరల్

ఇక మంత్రి ఆర్కే రోజా గురించి అసభ్యంగా మాట్లాడిన బండారు సత్యనారాయణపై చర్యలు తీసుకోవాలని కోరుతూ అంతకుముందు జాతీయ మహిళా కమిషన్ ను రామ్ గోపాల్ వర్మ కోరారు. ఇక మహిళా మంత్రిపై మీ పార్టీ నాయకుడు చేసిన అసభ్యకర వ్యాఖ్యలను సమర్థిస్తారా అంటూ నారా భువనేశ్వరి, నారా బ్రాహ్మణిలను రాంగోపాల్ వర్మ ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. బండారు సత్యనారాయణ మాట్లాడిన యూట్యూబ్ వీడియో లింక్ కూడా ఆయన షేర్ చేశారు. బండారు సత్యనారాయణకు మద్దతుగా నారా లోకేష్ చేసిన ట్వీట్ ను అంగీకరిస్తారా అని కూడా ఆర్జీవీ లోకేష్, బ్రాహ్మణిని ప్రశ్నించారు. అంతేకాక బండారు సత్యనారాయణ తర్వాత టీడీపీలో మరో ఆణిముత్యం అయ్యన్నపాత్రుడు అంటూ మరో యూట్యూబ్ లింక్ షేర్ చేసిన ఆయన బండారుపై చర్యలు తీసుకున్నట్టుగానే.. బ్రాహ్మణిని అగౌరవపరిచేలా వ్యాఖ్యానించిన అయ్యన్నపాత్రుడిపైనా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.