Vyuham- Sapatham: మళ్ళీ రిలీజ్ డేట్లు మారాయి.. వ్యూహం – శపథం కొత్త డేట్లు అనౌన్స్ చేసిన వర్మ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ram Gopal Varma Vyuham- Sapatham New Release Dates Announced: రామ్ గోపాల్ వర్మ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ‘వ్యూహం’ సినిమాకి ఏర్పడిన సెన్సార్ ఇబ్బందులు తొలిగాయి. అజ్మల్, మానస ప్రధాన పాత్రల్లో ప్రముఖ నిర్మాత దాసరి కిరణ్ కుమార్ ఈ నిర్మించిన ఈ మూవీ రిలీజ్ చేయకుండా చూడాలని టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ సెన్సార్ బోర్డుకు లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఇదే విషయం మీద కోర్టుకు వెళ్లగా అనేక వాదనలు, తీర్పులు అనంతరం వ్యూహం సినిమాకి అన్ని అడ్డంకులు తొలిగాయి. ఈ నేపథ్యంలో సినిమాని ఫిబ్రవరి 16వ తేదీ రిలీజ్ చేస్తారని రామ్ గోపాల్ వర్మ ముందే ప్రకటించారు. అయితే ఇప్పుడు సినిమా రిలీజ్ డేట్ మారుస్తున్నట్లు ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. ఫిబ్రవరి 23వ తేదీన వ్యూహం సినిమా రిలీజ్ చేస్తున్నట్లు వర్మ పేర్కొన్నారు.
Isha Ambani : టుట్టి ఫ్రూటీ, పాన్ పసంద్ అమ్మే కంపెనీని కొనుగోలు చేయనున్న ఇషా అంబానీ
Also Read
- Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
- Ghani Movie Failure: 'గని' ఫ్లాప్ కావడానికి కారణం ఇదేనట! తొలిసారి స్పందించిన వరుణ్ తేజ్..
- Tollywood Ticket Prices: టాలీవుడ్లో మళ్లీ టికెట్ రేట్ల చర్చ.. కొత్త కమిటీ ఏర్పాటు చేసిన ఫిల్మ్ ఛాంబర్
- Varun Tej Love Story: ఏడేళ్ల పాటు సీక్రెట్‌గా సాగిన ప్రేమ.. ఆ హీరోయిన్‌తో బంధంపై మనసు విప్పిన వరుణ్ తేజ్
అదే విధంగా వారం రోజుల తర్వాత అంటే మార్చి ఒకటో తేదీన శపథం సినిమాని రిలీజ్ చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణానంతరం ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి జీవితంలో జరిగిన అంశాల ఆధారంగా చేసుకుని తెరకెక్కించారు. ఈ సినిమా ఎప్పుడో నవంబర్ నెలలో రిలీజ్ కావాల్సి ఉంది కానీ సెన్సార్ సర్టిఫికెట్ ఇచ్చేందుకు అప్పట్లో సెన్సార్ బోర్డు నిరాకరించింది. సినిమాలోని పాత్రలకు నిజ జీవితంలోని నేతల పేర్లు పెట్టడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది, ‘వ్యూహం’ చిత్రానికి సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వలేమని తేల్చి చెప్పింది. ‘వ్యూహం’ సినిమాతో పాటు పార్ట్-2ని ‘శపథం’ పేరుతో వర్మ రిలీజ్ చేయబోతున్నారు. ‘వ్యూహం’ సినిమాని నవంబర్ 10న, ‘శపథం’ మూవీని జనవరి 25న ప్రేక్షకులముందుకు తీసుకురావడానికి ముందు ప్లాన్ చేశారు. అయితే ఇప్పుడు ఫిబ్రవరి 23వ తేదీన వ్యూహం, మార్చి ఒకటో తేదీన శపథం సినిమాని రిలీజ్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!