NTV Telugu Site icon

RGV : అజయ్‌ దేవ్‌గన్ వర్సెస్ కిచ్చా సుదీప్… వర్మ షాకింగ్ కామెంట్స్

Rgv

Rgv

అజయ్‌ దేవ్‌గన్ వర్సెస్ కిచ్చా సుదీప్ అన్నట్టుగా ఉంది సోషల్ మీడియాలో పరిస్థితి. హిందీ భాష ఇకపై నేషనల్ లాంగ్వేజ్ కాదంటూ సుదీప్ చేసిన కామెంట్స్ పై అజయ్ దేవగన్ ఘాటుగా స్పందించాడు. ఇక సుదీప్ కూడా మీరు హిందీలో ఇచ్చిన రిప్లైని నేను చదవగలిగాను. మరి నేను కన్నడలో రిప్లై ఇస్తే పరిస్థితి ఏంటి? అంటూ గట్టిగానే కౌంటర్ ఇచ్చాడు. అంతేకాకుండా నేను ఆ మాటను అన్న సందర్భం వేరు, అది మీకు చేరిన విధానం వేరు అంటూ క్లారిటీ ఇచ్చాడు. దీంతో అజయ్ కూల్ అవుతూ అన్ని భాషలనూ గౌరవిస్తాము. భారతీయ సినిమా ఇండస్ట్రీ అంతా ఒక్కటే అంటూ కాంట్రవర్సీకి ముగింపు పలికారు. అయితే తాజాగా ఈ వివాదంలో వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కలగజేసుకుని, బాలీవుడ్ ను వరుస ట్వీట్ లతో ఓ రేంజ్ లో రోస్ట్ చేస్తున్నాడు.

Read Also : Kanmani Rambo Khatija Twitter Talk : ఎలా ఉందంటే ?

“అజయ్ దేవగన్ మీరు హిందీలో చేసిన ట్వీట్‌కి కన్నడలో సమాధానం ఇస్తే ఏమిటనే దానిపై మీరు వేసే నెక్స్ట్ క్వశ్చనే అసలు పాయింట్… ఉత్తరం, దక్షిణాలు లేవు. భారతదేశం అంతా ఒక్కటే అని అందరూ గుర్తిస్తారని నేను ఆశిస్తున్నాను” అంటూనే “అజయ్ నువ్వు నాకు చాలా కాలంగా తెలుసు. కొందరికి అనిపించిన విధంగా మీరు ఎప్పటికీ అర్థం చేసుకోలేరని నాకు తెలుసు. భాషలు ప్రాంతీయ, సాంస్కృతిక అనుకూలతలను బట్టి పెరుగుతాయి. అంతేకాదు ఏకీకృతం చేయడానికి, విడిపోవడానికి ఉద్దేశించబడ్డాయి” అంటూ అజయ్ దేవగన్ ను ట్యాగ్ చేశారు.

ఇక సుదీప్ గురించి మాట్లాడుతూ “మీరు ఈ ప్రకటన చేసినందుకు సంతోషిస్తున్నానో లేదో… ఎందుకంటే అక్కడ బలమైన కలకలం ఏర్పడితే, ముఖ్యంగా బాలీ(ఉత్తర)వుడ్, శాండల్(దక్షిణ)వుడ్ మధ్య యుద్ధం లాంటి పరిస్థితులు కనిపిస్తున్న సమయంలో ఎవరూ ప్రశాంతంగా ఉండలేరు” అంటూ చెప్పుకొచ్చారు. “కిచ్చా సుదీప్ సర్ మీరు చెప్పింది కాదనలేని సత్యం… సౌత్ స్టార్స్ అంటే నార్త్ స్టార్స్ అసురక్షితంగా, అసూయగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే కన్నడ డబ్బింగ్ చిత్రం #KGF2 అక్కడ 50 కోట్ల ఓపెనింగ్ డేని సాధించింది. మనమందరం రాబోయే హిందీ చిత్రాల ఓపెనింగ్ డేస్ ను చూడబోతున్నాం. పుడ్డింగ్ రుజువు తినడంలో ఉన్నట్లుగా, ‘రన్‌వే 34’ కలెక్షన్‌లు హిందీ వర్సెస్ కన్నడలో ఎంత బంగారం (kgf2) ఉందో రుజువు చేస్తుంది” అంటూ అజయ్‌ దేవ్‌గన్ వర్సెస్ కిచ్చా సుదీప్ హ్యాష్ ట్యాగ్ ను జత చేశాడు వర్మ. మొత్తానికి కూల్ అయ్యిందని అనుకున్న ఈ వివాదానికి మరింత ఆజ్యం పోశాడు వర్మ. మరి ఈయన కామెంట్స్ కు ఎవరెవరి నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో చూడాలి.