Site icon NTV Telugu

RGV: ‘డేంజరస్’ భామల ముద్దులతో తడిసిపోతున్న వర్మ.. ఫోటో వైరల్

Varma

Varma

వివాదాల దర్శకుడు ఏమి చేసినా అది సంచలనమే.. ఇక హీరోయిన్లతో వర్మ చేసే రచ్చ అది మరో హైలైట్ ఉంటుంది. యాంకర్లను స్టార్లను చేయడం, తన హీరోయిన్లను సెలబ్రిటీలను చేయడం వర్మకు కొట్టిన పిండి. ఇక తాజాగా వర్మ చూపు ఇద్దరు డేంజరస్ అమ్మాయిల మీద పడింది. వర్మ దర్శకత్వంలో అప్సర రాణి, నైనా గంగూలీ జంటగా నటించిన చిత్రం డేంజరస్. మొట్టమొదటి లెస్బెనియన్ చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమా కొన్ని కారణాల వలన వాయిదా పడి ఎట్టకేలకు మే 6 న రిలీజ్ కానుంది. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడడంతో వర్మ ప్రమోషన్ల జోరును పెంచేశాడు. సినిమాపై ఆసక్తి రావడానికి తన స్టాటజీని వాడుతున్నాడు.

ముద్దుగుమ్మల అందాలను ఎరగావేస్తూ వీడియోలను పోస్ట్ చేసే వర్మ తాజాగా ఒక ఫొటోలో తన ముఖం వరకు ఉన్న ఫోటోను క్రాప్ చేసి  షేర్ చేస్తూ.. ఇలాంటి ఎక్స్ ప్రెషన్ ఎప్పుడు ఇస్తానో చెప్పినవారికి రూ. లక్ష బహుమతిగా ఇస్తానని ప్రకటించాడు.  ఆ ఫొటోలో ఎప్పుడు జరగని ఒక అద్భుతం జరిగితే ఒక మనిషి హావభావం ఎలా అంటుందో అలా ఉన్నాడు వర్మ.. ఇక చాలామంది నెటిజన్స్ తమదైన రీతిలో సమాధానాలు చెప్పుకుంటూ వచ్చారు. ఇక చివరికి వర్మనే ఇదుగో సమాధానం అంటూ ఆ ఫోటోను పూర్తిగా రివీల్ చేశాడు. ఇక ఆ ఫొటోలో డేంజరస్ ముద్దుగుమ్మలు అప్సర, నైనా ఇద్దరు వర్మ చెరో చెంపపై తమ అందాల పెదవులతో ముద్దుపెడుతూ కనిపించారు. ” నా ఈ ఎక్స్ ప్రెష్ కు కారణం ఈ ఇద్దరు డేంజరస్ అమ్మాయిలే .. వారు నన్ను ఇలా చేస్తున్నారు” అంటూ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ ఫోటోపై నెటిజన్లు ఆడేసుకుంటున్నాడు. ముసలాడికి దసరా పండగ అంటే ఇదే అని కొందరు.. పుడితే వర్మలానే పుట్టాలిరా అని మరికొందరు కామెంట్స్ పెడుతున్నారు.

 

 

Exit mobile version