Site icon NTV Telugu

RGV : “కేజీఎఫ్-2″నే ప్రూఫ్… స్టార్ల రెమ్యూనరేషన్లపై వర్మ షాకింగ్ ట్వీట్!

RGV

ఇప్పుడు ఎక్కడ చూసినా “కేజీఎఫ్-2” పేరే విన్పిస్తోంది. ఇలాంటి భారీ సినిమాలకు వచ్చే క్రేజ్ ను ఉపయోగించుకోవడంలో డైరెక్టర్ వర్మ ఎప్పుడూ ముందుంటారు. తాజాగా వర్మ “కేజీఎఫ్-2” మూవీ హిట్ అవ్వడమే ప్రూఫ్ అంటూ స్టార్స్ రెమ్యూనరేషన్ కోసం డబ్బులు వేస్ట్ చేయకపోతే మంచి క్వాలిటీ కంటెంట్ వస్తుందని ట్వీట్ చేశారు. “స్టార్స్ రెమ్యూనరేషన్ల కోసం డబ్బును వృధా చేయకుండా మేకింగ్ కోసం ఖర్చు చేస్తే మరింత నాణ్యత, గొప్ప హిట్‌లు వస్తాయి అనడానికి KGF 2 మాన్స్టర్ హిట్టే స్పష్టమైన రుజువు” అంటూ వర్మ ట్వీట్ చేశారు.

Read Also : KGF Chapter 2 : 19 ఏళ్ల ఎడిటర్… ఈ ఆణిముత్యం ఎలా దొరికాడంటే ?

గత కొన్ని రోజుల క్రితం ఏపీలో ప్రభుత్వం టికెట్ రేట్లను తగ్గించినప్పుడు ఇదే చర్చ వచ్చింది. హీరోలు తమ పారితోషికాన్ని తగ్గించుకుంటే సినిమా తక్కువ బడ్జెట్ లోనే పూర్తవుతుందని కామెంట్స్ రాగా, స్టార్స్ కోసమే జనాలు థియేటర్లకు వస్తారని, అంతేకాకుండా సినిమా కోసం స్టార్స్ పడే కష్టం, స్టార్స్ కు జనాల్లో ఉన్న క్రేజ్ రెమ్యూనరేషన్ ను ఖరారు చేస్తుందంటూ సినిమా పెద్దలు చెప్పుకొచ్చారు. ఇప్పుడు వర్మ చేసిన ట్వీట్ వాళ్ళను ఉద్దేశించే అన్పిస్తోంది. అయితే అదే సందర్భంలో వర్మ కూడా టాలీవుడ్ కే సపోర్ట్ చేస్తూ మాట్లాడిన విషయం తెలిసిందే. ఇక ఇటీవలే బాహుబలి, ఆర్ఆర్ఆర్, కేజిఎఫ్-2 వంటి మన సౌత్ సినిమాలు బీటౌన్ లో రికార్డులను బ్రేక్ చేయడం గురించి కూడా వర్మ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే.

Exit mobile version