Site icon NTV Telugu

Ram Gopal Varma: వర్మపై బీజేపీ ఫైర్.. అది వెటకారం అన్న ఆర్జీవీ

Rgv

Rgv

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పై బీజేపీ మండిపడింది. అతడు చేసిన కొన్ని అనుచిత వ్యాఖ్యలపై పోలీస్ స్టేషన్ లో బీజేపీ నేతలు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. గత కొన్ని రోజుల నుంచి రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము పేరు వినిపిస్తున్న విషయం విదితమే. ఇక ఈ నేపథ్యంలోనే ఆమెను ఉద్దేశిస్తూ వర్మ ఒక ట్వీట్ చేశాడు. “ఒకవేళ ద్రౌపది ప్రెసిడెంట్ అయితే.. ఇక్కడ పాండవులు ఎవరు..? ఇక ముఖ్యంగా కౌరవులు ఎవరు..?” అంటూ ప్రశ్నించాడు. ఈ ట్వీట్ పై బీజేపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఒక మహిళను, రాష్ట్రపతి అభ్యర్థిని కించపర్చినట్లు మాట్లాడిన వర్మపై బీజేపీ నేతలు మండిపడటంతో పాటు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు కూడా చేశారు.

ఆర్జీవీ పై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇక తాజాగా అయి విషయంపై వర్మ ట్విట్టర్ వేదికగా స్పందించాడు. “ఇది కేవలం వెటకారంగా చెప్పబడింది. మహాభారతంలో ద్రౌపది పాత్ర నాకు చాలా ఇష్టం. అయితే ఈ పేరు చాలా అరుదుగా ఉన్నందున అది నాకు గుర్తుండిపోయింది. అందుకే నేను ఆమె గురించి చెప్పుకొచ్చాను. అంతేకానీ వేరే ఉద్దేశ్యంతో చెప్పలేదు, ఎవరి మనోభావాలను దెబ్బతీయాలనే ఉద్దేశ్యంతో మాత్రం నేను చెప్పలేదు” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. మరి ఈ ట్వీట్ పై బీజేపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.

Exit mobile version