Site icon NTV Telugu

Ram Gopal Varma: పీక పిసికేసి చంపేస్తా, బట్టలూడదీసి పరిగెత్తిస్తా.. పవన్ గురించి వర్మ ట్వీట్ వైరల్

Varma

Varma

Ram Gopal Varma: వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వివాదాలను కొన్నితెచ్చుకోవడంలో ఆయన తరువాతే ఎవరైనా. ప్రస్తుతం వర్మ.. మంచి సినిమాలు తీయడం మానేసి రాజకీయ బయోపిక్ లు తీయడం మొదలుపెట్టాడు. ఇక సినిమాలు కాకుండా ట్విట్టర్ లో టీడీపీ, జనసేన అధినేతలు అయిన చంద్రబాబు, పవన్ ను విమర్శిస్తూ ట్వీట్ చేసి అభిమానుల ఆగ్రహానికి గురవుతూ ఉంటాడు. తాజాగా మరోసారి వర్మ, జనసేనాని పై పంచులు వేశాడు గత కొన్నిరోజులుగా పవన్.. వారాహి యాత్ర చేస్తున్న విషయం తెల్సిందే. ఈ యాత్రలో పవన్ .. కొద్దిగా ఘాటు వ్యాఖ్యలు చేయడం చూస్తూనే ఉన్నాం. ఇక ఆ వ్యాఖ్యలపై వర్మ సెటైర్లు వేశాడు.

OG: ఒకరి తర్వాత ఒకరు డ్యూటీ ఎక్కుతున్నారు ఏంటి సర్?

“చివరికి రాజకీయ క్యాంపైన్లు ఇక్కడికి చేరాయి.. తననుకున్నదాన్ని ఎవరు వ్యతిరేకించినా అధికారం లో కొస్తే పీక పిసికేసి చంపేస్తా , బట్టలూడదీసి పరిగెత్తిస్తా ,చర్మం వొలిచేస్తా, లాంటి హింసాత్మికమైన బెదిరింపులు ప్రపంచ చరిత్రలో ఏ దేశంలో హిట్లర్, సద్దాం, కిం జొంగ్ ఉన్ తో సహా ఎవరూ అనుండరు. ఇంకో విషయమేంటంటే అధికారం లోకి వస్తే నరికేస్తాను అంటే ఇప్పుడు అధికారంలో వున్న పార్టీ అది చేయచ్చు అని చెప్పడమా ? ఏది ఏమైనా ఒక ప్రజాస్వామ్య దేశంలో తన ఫాలోయర్స్ కి డైరెక్ట్ గా ఇంత బ్రూటల్ వయోలెన్స్ ని ప్రభోదించడం తీవ్రవాదం కన్నా ప్రమాదకరమైన ఆటవిక మనస్తత్వం. ఇలాంటి హింస ని ఎంకరేజ్ చేస్తూ అరుస్తూ ఉంటే ఆ మీటింగ్లకొచ్చ్చే ఆ యువకులను భవిష్యత్తులో ఏం చేయాలనుకుంటున్నాడో పవన్ కళ్యాణ్ కే తెలియాలి. పైగా ఈ వయోలేంట్ బెదిరింపులన్ని లైవ్ మీడియా ముందు ప్రజలందరూ లివింగ్ రూమ్స్ లో పిల్లల తో పాటు టీవిలో చూస్తున్నారు” అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఈ ట్వీట్ పై పవన్ అభిమానులు మండిపడుతున్నారు. నువ్వు ఇలా ట్వీట్ చేస్తుంటే.. సర్, మీరు ఇలాంటి మాటలు చెబుతుంటే, ప్రతివ్రత పరమాన్నం లాంటి మాటలు గుర్తుకు వస్తున్నాయి. నువ్వెంటి వర్మ సడెన్ గా గౌతమ బుద్దలా మారిపోయావు.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Exit mobile version