NTV Telugu Site icon

Ram Gopal Varma: కృష్ణుడు పైనే సెటైర్ వేసిన వర్మ.. వారే గోపికలా

Varma

Varma

Ram Gopal Varma: వివాదాలు సృష్టించడంలో రామ్ గోపాల్ వర్మ తరువాతనే ఎవరైనా.. అసలు ఎందుకు ట్వీట్ చేస్తాడో తెలియదు.. ఎందుకు మాట్లాడతాడో తెలియదు అని కొంతమంది నెటిజన్లు అన్నా మరికొందరు మాత్రం బతికితే వర్మలానే బతకాలి అని చెప్పుకొస్తారు. ఏదిఏమైనా మొదటి నుంచి కూడా ప్రతి పండగకు వర్మ చెప్పే శుభాకాంక్షలు చెప్పే విధానం ఏదైతే ఉందో అది మాత్రం హైలైట్ అని చెప్పుకోవాలి. ఇక తాజాగా దీపావళీ శుభాకాంక్షలు చెప్తూ కృష్ణుడు గురించి సెటైర్ వేశాడు.

” నాకు తెలియక అడుగుతున్నాను.. వికీపీడియా ప్రకారం కృష్ణుడు నరకాసురుడిని వధించి 16000 మంది అమ్మాయిలను విడిపించాడు..నా ప్రశ్న ఏమిటంటే.. గోపికలుగా అవతరించిన అమ్మాయిలు వారేనా..?” అని అడిగాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ ట్వీట్ కు నెటిజెన్స్ తమదైన రీతిలో స్పందిస్తున్నారు. వెళ్లి వికీపీడియానే అడుగు అని కొందరు.. నువ్వు పురాణాలు చదివినంతగా మేము చదవలేదు అని మరికొందరు.. వోడ్కా తాగి మాట్లాడుతున్నావా అని ఇంకొందరు కామెంట్స్ పెడుతున్నారు. ఇక తెలిసినవాళ్ళు మాత్రం గోపికలు వేరు.. అమ్మాయిలు వేరు అని చెప్పుకొస్తున్నారు. ఏదిఏమైనా పండగ పూట ఇలా కృష్ణుడు గురించి సెటైర్లు వేయడం మంచిది కాదని, అది అందరిని అవమానించడమే అని చెప్పుకొస్తున్నారు. ఇంకొంతమంది నరకాసురుడును చంపింది కృష్ణుడు కాదు అని సత్యభామ అని మరికొందరు చెప్పుకొస్తున్నారు.