Site icon NTV Telugu

Ram Gopal Varma: రాజకీయాల్లోకి వర్మ.. ?

Rgv

Rgv

వివాదాలు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నిత్యం సోషల్ మీడియా లో ఏదో ఒక వివాదం సృష్టిస్తూ నెటిజన్ల నోటిలో ఎప్పుడు నానుతూనే ఉంటాడు. ఒక్కోసారి బాలీవుడ్ అంటదు.. ఇంకోసారి టాలీవుడ్ అంటదు.. మరోసారి రాజకీయ నాయకులను ఏకిపారేస్తాడు.. ఇంకోసారి హీరోయిన్లను ఎత్తేస్తాడు. ఇలా నిత్యం ఏదో ఒక వార్తలో మాత్రం ఉంటూనే ఉంటాడు. ఇక తాజాగా ఆయన తన పొలిటికల్ ఎంట్రీ గురించి చెప్పి అందరికి షాక్ ఇచ్చాడు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న వర్మ ఎప్పటిలానే తన గురించి తాను చెప్పుకుంటూ రాజకీయ రంగప్రవేశం గురించి కూడా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు.

వర్మ.. మీకు రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన ఉందా..? అన్న ప్రశ్నకు ఆయన స్పందిస్తూ.. “బుద్ది ఉన్నవాడు ఎవడు నాకు ఓటెయ్యడు.. ఎందుకంటే నాకు నేనే బతుకుతాను.. వేరేవారి గురించి పట్టించుకోను. అది ఒక రాజకీయ నాయకుడికి ఉండకూడని లక్షణం. నేను జనాలకు ఏం చేయననే విషయం వారికి బాగా తెలుసు. అందుకే నాకు ఎవ్వరు ఓటు వెయ్యరు.. నాకు రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశ్యం అస్సలు లేదు” అని చెప్పుకొచ్చాడు. ఇక దీంతో బతికించావ్.. ఎక్కడ నువ్వు కూడా రాజకీయాలు అంటూ వెళ్లి అక్కడ కూడా అంతా నా ఇష్టం అంటావని భయపడ్డాం అని కొందరు.. నీకు రాజకీయాలు సెట్ కావులే కానీ వోడ్కా తాగి ఒక రెండు ట్వీట్లు వేయి అని మరికొందరు కామెంట్స్ పెడుతున్నారు.

Exit mobile version