RGV : ఆర్జీవీ ఎప్పటికప్పుడు ఏదో ఒక సంచలన కామెంట్స్ చేస్తూనే ఉంటారు. అది ఎంత పెద్ద వివాదం అయినా ఆయన పెద్దగా పట్టించుకోరు. మరోసారి అలాంటి కామెంట్స్ చేశారు. తాజాగా ఆయన ఓ పాడ్ కాస్ట్ ప్రోగ్రామ్ లో పాల్గొన్నారు. ఇందులో మాట్లాడుతూ.. ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీ పడిపోయింది. మన సినిమాలను వాళ్లు కాపీ కొడుతున్నారు. కానీ ఒకప్పుడు బిగ్ బీ సినిమాలే మన సౌత్ కు స్ఫూర్తిగా ఉండేవి. అమితాబ్ బచ్చన్ సినిమాలను మన వాళ్లు కాపీ కొట్టేవారు.
Read Also : Ritu Varma : సినిమా ప్లాప్ అయితే హీరో, హీరోయిన్లపై నిందలు.. రీతూవర్మ కామెంట్స్
అప్పట్లో చిరంజీవి, రజినీకాంత్, ఎన్టీరామారావు, ఏఎన్నార్ బిగ్ బీ సినిమాలను రీమేక్ చేసేవాళ్లు. అలా చేయడం వల్లే ఇక్కడ హిట్లు కొట్టి స్టార్ హీరోలు అయ్యారు. బిగ్ బీ వల్లే మన వాళ్లు ఇక్కడ అభిమానులకు దేవుళ్లు అయ్యారు. కానీ 1990లో అమితాబ్ కొంత బ్రేక్ తీసుకోవడం వల్ల మనవాళ్లు అదే మాస్ సినిమాలు తీస్తూ వచ్చారు.
చాలా వరకు బిగ్ బీ వల్లే మన సౌత్ లో సినిమా ఇండస్ట్రీకి ఆదరణ పెరిగింది. కానీ ఆ విషయాన్ని ఎవరూ ఒప్పుకోరు. ఇప్పుడు బాలీవుడ్ చాలా పడిపోయింది. మన సినిమాలు అక్కడ రీమేక్ అవుతూ మంచి హిట్ కొడుతున్నాయి. పరిస్థితి ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఒక్కోసారి ఒక్కో ఇండస్ట్రీ టైమ్ నడుస్తుంది’ అంటూ చెప్పుకొచ్చాడు ఆర్జీవీ.
Read Also : Ritu Varma : సినిమా ప్లాప్ అయితే హీరో, హీరోయిన్లపై నిందలు.. రీతూవర్మ కామెంట్స్
