NTV Telugu Site icon

Ram Gopal Varma: ఇవాళైనా రాంగోపాల్ వర్మ వెళ్తాడా?

ramgopal-varma

ramgopal varma

ఇవాళ ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్ లో విచారణకి సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ హాజరుకావాల్సి ఉంది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ఫోటోలు మార్ఫింగ్ చేసి ఎక్స్ లో పోస్ట్ చేసిన కేసులో విచారణ ఎదుర్కొంటున్నాడు రాంగోపాల్ వర్మ. ఈనెల 19న విచారణకి హాజరుకాకుండా వారం రోజులు గడువు కోరాడు రాంగోపాల్ వర్మ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ విజ్ఞప్తి మేరకు ఇవాళ హాజరు కావాలని 20వ తేదీన మరోసారి నోటీసులు ఇచ్చారు ఒంగోలు రూరల్ సీఐ శ్రీకాంత్. రాంగోపాల్ వర్మ వాట్సాప్ కి నోటీసులు పారు సీఐ శ్రీకాంత్. ఇక ఈరోజు రామ్ గోపాల్ వర్మ వస్తారని భావించి ఒంగోలు రూరల్ సర్కిల్ కార్యాలయంలో విచారణకు ఏర్పాటు చేశారు పోలీసులు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఎప్పుడైనా హాజరు కావచ్చని పోలీసులు నోటీసులతో పేర్కొన్నారు.

Rashmika Mandanna: అదేంటి రష్మిక పెళ్లి గురించి అలా అనేసింది!

వర్మ ఇవాళ పోలీసుల విచారణకు హాజరుకాకుంటే తదుపరి చర్యలకు వెళ్లనున్నారు పోలీసులు..అయితే ఏపీ హైకోర్టులో సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ మూడు పిటిషన్లు దాఖలు చేసినట్టు తెలుస్తోంది. నిజానికి ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్, అనకాపల్లి, గుంటూరులో వర్మపై కేసులు నమోదు అయ్యాయి. ఈ క్రమంలో ఈ కేసుల్లో ముందస్తు బెయిల్ ఇవ్వాలని పిటిషన్లు వేశారు రామ్ గోపాల్ వర్మ. ఈ క్రమంలో ఈ పిటిషన్లు మీద రేపు విచారణ చేపట్టనుంది ఏపీ హైకోర్టు. ఇప్పటికే ప్రకాశం జిల్లా మద్ది పాడు పోలీసులు నమోదు చేసిన కేసులో వర్మ ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలో మొత్తం ఇప్పటి వరకు వర్మపై ఏపీలో 3 కేసులు నమోదు అయినట్టు అయింది.

Show comments