Site icon NTV Telugu

Dangerous : ఆర్జీవీకి షాక్… సినిమా ప్రదర్శనకు థియేటర్ల నిరాకరణ

Dangerous

Dangerous

రామ్ గోపాల్ వర్మ గత కొన్నాళ్లుగా సినిమాల మీద సినిమాలు చేస్తూనే ఉన్నాడు. ఇప్పుడు తన నెక్స్ట్ మూవీ “డేంజరస్” ప్రమోషన్‌లలో బిజీగా ఉన్నారు. వర్మ లెస్బియన్ రూపొందించిన “డేంజరస్” ఏప్రిల్ 8న థియేటర్లలోకి రావడానికి సిద్ధంగా ఉంది. “డేంజరస్” క్రైమ్ థ్రిల్లర్-డ్రామా. ఖత్రా అనేది సెక్షన్ 377 రద్దు తర్వాత ఇద్దరు మహిళల మధ్య సాగే ప్రేమకథ. ఇక ఈ మూవీ తెలుగులో “మా ఇష్టం” , హిందీలో “ఖత్రా” పేరుతో విడుదలకు రెడీగా ఉంది. ఈ చిత్రంలో అప్సర రాణి, నైనా గంగూలీ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. సెన్సార్ బోర్డ్ ఈ చిత్రానికి A సర్టిఫికేట్ ను జారీ చేసింది. అయితే లెస్బియన్ నేపథ్యంలో మూవీ తెరకెక్కిన కారణంగా కొన్ని థియేటర్లు ఈ చిత్రాన్ని ప్రదర్శించడానికి నిరాకరించి ఆర్జీవీకి షాక్‌ ఇచ్చాయి.

Read Also : Naga Chaitanya : నెక్స్ట్ మూవీకి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్

ఈ విషయాన్ని వర్మ స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. “@_PVRcinemas, @INOXCINEMAS నా చిత్రం ‘ఖత్రా’ (Dangerous) లెస్బియన్ ఇతివృత్తంతో తెరకెక్కింది కాబట్టి ప్రదర్శించడానికి నిరాకరించారు. సుప్రీంకోర్టు సెక్షన్ 377ని రద్దు చేసింది. సెన్సార్ బోర్డు ఆమోదించిన తర్వాత ఈ మూవీ విడుదలకు సిద్ధమైంది. నేను, #LGBT కమ్యూనిటీ మాత్రమే కాకుండా @_PVRcinemas, @INOXCINEMAS నిర్వహణకు వ్యతిరేకంగా నిలబడాలని ప్రతి ఒక్కరినీ అభ్యర్థిస్తున్నాను. ఇది మానవ హక్కులను అవమానించడమే” అంటూ పోస్ట్ చేశారు.

Exit mobile version