Site icon NTV Telugu

RGV : రితేష్ దేశ్‌ముఖ్ – రామ్ గోపాల్ వర్మ కలయికలో ఛత్రపతి శివాజీ బయోపిక్.. ట్వీట్ వైరల్

Ram Gopal Varma & Riteish Deshmukh

Ram Gopal Varma & Riteish Deshmukh

రామ్ గోపాల్ వర్మ మరోసారి హాట్ టాపిక్‌గా మారారు. టాలీవుడ్, బాలీవుడ్‌లలో తనదైన శైలితో సినిమాలు చేసిన వర్మ, ఇప్పుడు బాలీవుడ్ నటుడు రితేష్ దేశ్‌ముఖ్‌తో కలిసి ఛత్రపతి శివాజీ బయోపిక్ చేయబోతున్నారు. రితేష్ ఈ చిత్రంలో కేవలం హీరోగానే కాకుండా దర్శకుడు, నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు. మహారాష్ట్ర గర్వకారణమైన శివాజీ మహారాజ్ జీవితం ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాను గురించి వర్మ సోషల్ మీడియాలో షేర్ చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్‌గా మారింది.

Also Read : Unni Mukundan: మాజీ మేనేజర్ ఆరోపణలపై ఉన్ని ముకుందన్ స్పందన..

“నేను రాజా శివాజీతో ఉన్నాను.. ఇది భారత్‌లో ఎప్పుడూ రానటువంటి అత్యుత్తమ చారిత్రక చిత్రం అవుతుంది” అని వర్మ పేర్కొన్నారు. రితేష్ దేశ్‌ముఖ్ విషయానికి వస్తే.. ఇప్పటికే హిందీ, మరాఠీ సినిమాలతో పాటు టెలివిజన్ హోస్ట్‌గా కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు ఈ భారీ ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతుండటంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ చిత్రంతో పాటు మస్తీ 4, ధమాల్ 4 వంటి చిత్రాలలో కూడా నటిస్తున్నారు రితేష్ .  కానీ భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ రాజా శివాజీ మూవీతో రితేష్ ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తారో చూడాలి. పైగా వర్మ కలయిక కావడంతో అంచనాలు ఇప్పుడు మరింత పెరిగిపోయాయి.

 

Exit mobile version