డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్‌ఖాన్‌కు బెయిల్ రావడంపై ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించాడు. ఈ కేసులో ఆర్యన్ ఖాన్ తరఫున బాంబే హైకోర్టులో సీనియర్ లాయర్ ముకుల్ రోహత్గీ వాదించారు. దేశంలో ఆయన చాలా ఫేమస్ లాయర్. అటార్నీ జనరల్‌గానూ పనిచేశారు. ఈ నేపథ్యంలో ముకుల్ రోహత్గీ వంటి లాయర్ వాదించబట్టే ఆర్యన్ ఖాన్‌కు బెయిల్ వచ్చిందని దర్శకుడు వర్మ అభిప్రాయపడ్డాడు.
Read Also: అభిమానులకు సారీ చెప్పిన అజయ్ భూపతి
అంటే ముకుల్ రోహత్గీ కంటే ముందు వాదించిన లాయర్లు అసమర్థులా? అని వర్మ ప్రశ్నించాడు. ఇన్ని రోజులు తప్పు చేయకుండానే ఆర్యన్ ఖాన్‌ను జైల్లో ఉంచారా? అని నిలదీశాడు. అయితే చాలామంది ముకుల్ రోహత్గీ లాంటి ఖరీదైన లాయర్లను పెట్టుకోలేరని వర్మ ట్వీట్ చేశాడు. అందుకే అమాయకులైన ఎంతో మంది జైళ్లలోనే అండర్ ట్రయల్స్‌గా మగ్గిపోతున్నారని వర్మ ఆవేదన వ్యక్తం చేశాడు. కాగా ఆర్జీవీ ట్వీట్‌కు పలువురు నెటిజన్లు పాజిటివ్‌గా స్పందిస్తున్నారు. మరికొందరు డ్రగ్స్ నేపథ్యంలో సినిమా తీయాలని వర్మను కోరారు.
