Site icon NTV Telugu

RGV: ఓటీటీలో ‘వ్యూహం, శపథం’.. మా అసలు వ్యూహం ఇదే.. వర్మ షాకింగ్ ప్రకటన

Rgv

Rgv

Ram Gopal Varma OTT Announcement of Vyooham and Sapatham: అనునిత్యం ఏవో ఒక సంచలన అంశాలతో వార్తల్లో నిలుస్తూ ఉండే రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు ఒక ప్రకటనతో అందరినీ షాక్ కి గురి చేశారు. ఆయన ఏపీ సీఎం జగన్ ప్రధానంగా వ్యూహం, శపథం సినిమాలు చేసున్నట్టు ప్రకటించారు. అందులో వ్యూహం సినిమా ఎన్నో వాయిదాల అనంతరం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక శపథం సినిమా ఈ శుక్రవారం నాడు రిలీజ్ చేస్తానని వర్మ ప్రకటించినా ఇప్పటి దాకా ప్రమోషన్స్ ఏమీ లేకపోవడంతో వాయిదా పడుతుందని అనుకున్నారు. ఈ క్రమంలో రామ్ గోపాల్ వర్మ ఒక ప్రకటన చేశారు.

OTT platform: ప్రభుత్వ ఓటీటీ లాంచ్.. కానీ సినిమా చూడాలంటే?

దాని ప్రకారం వ్యూహం, శపథం సినిమాల వెనుక మా అసలు వ్యూహం సైడ్ బై సైడ్ వెబ్ సిరీస్ కూడా తియ్యటం అని చెప్పుకొచ్చారు. వేరు వేరు అడ్డంకుల మూలాన తప్పనిసరి పరిస్థితుల్లో సెన్సార్ బోర్డు అనుమతించిన వెర్షన్ మాత్రమే థియేటర్లలో రిలీజ్ చెయ్యడం జరిగింది కానీ ఇప్పుడు మేము ఫస్ట్ నుంచి రెడీ చేసి పెట్టుకున్న వెబ్ సిరీస్ శపథం ఆరంభం చాప్టర్ 1ని ఈ రోజు సాయంత్రం మార్చ్ 7th 8 PM కి, అలాగే శపథం అంతం చాప్టర్ 2 ని రేపు మార్చి 8 th 8 pm కి ముందు ఆంధ్ర ప్రదేశ్ లొ AP ఫైబర్ నెట్ లో ఓటీటీ యాప్ ద్వారా పే పర్ వ్యూ లొ చూసుకోవడానికి అవకాశం కలిపిస్తున్నామని ఆన్నారు. ఆ తర్వాత అంచెల వారీగా అన్ని ప్లాట్ ఫార్మ్స్ లో రిలీజ్ అవుతాయనిఅన్నారు.. శపథం ఆరంభం చాప్టర్ 1 , శపథం అంతం చాప్టర్ 2 రెండు కూడా తీసిన ఉద్దేశ్యం ఏమీ దాచకుండా పచ్చి నిజాలు చూపించడానికి మాత్రమే ఇలా చేస్తున్నామని రామ్ గోపాల్ వర్మ ప్రకటించారు.

Exit mobile version