Ram Gopal Varma : పెద్ద స్లార్లకు, భారీ బడ్జెట్ డైరెక్టర్లకు RGV కౌంటర్… హాలీవుడ్ హారర్ పై వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ram Gopal Varma : పెద్ద స్టార్లు ఉండాలి, వందల కోట్ల బడ్జెట్ ఉండాలి, అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్ ఉండాలి, అప్పుడే ప్రేక్షకులు థియేటర్లకు వస్తారనే సూత్రం సంవత్సరాలుగా హాలీవుడ్ నుంచి భారతీయ సినిమా వరకు బలంగా నాటుకుపోయింది. అయితే ఇప్పుడు ‘అబ్సెషన్’ అనే చిన్న హాలీవుడ్ హారర్ చిత్రం ఆ నమ్మకాన్ని పూర్తిగా తలకిందులు చేసింది. తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. కేవలం 7 కోట్ల రూపాయల బడ్జెట్‌తో రూపొందిన ఈ సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 1400 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు సాధించడం ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యానికి గురి చేసింది.
భారీ స్టూడియోలు, సూపర్స్టార్లు లేకపోయినా కథనం, ఉత్కంఠతోనే ప్రేక్షకులను ఆకట్టుకోవచ్చని ఈ సినిమా చూపించింది. ‘అబ్సెషన్’ కథ కూడా ఆసక్తికరంగానే ఉంటుంది. మ్యూజిక్ స్టోర్‌లో పనిచేసే బేర్ అనే యువకుడు తన చిన్ననాటి స్నేహితురాలు నిక్కీ తనను ప్రేమించాలని కోరుకుంటాడు. ఆ కోరిక నెరవేర్చడానికి అతను ఒక మాయా బొమ్మ సహాయాన్ని కోరుతాడు. అయితే ఆ తర్వాత అతని జీవితంలో చోటుచేసుకునే భయానక పరిణామాలే ఈ హారర్ సినిమా కథ.
Also Read
ఈ సినిమా గురించి తనదైన శైలిలో రామ్ గోపాల్ వర్మ ఆసక్తికరంగా స్పందించారు. పెద్ద స్టార్లు, భారీ బడ్జెట్ ఉంటేనే జనాలు థియేటర్లకు వస్తారనే భ్రమను ఈ సినిమా తుడిచేసిందని చెప్పుకొచ్చారు. 70 లక్షల కాస్ట్‌తో ఈ సినిమాను తీయచ్చని, ఒక ఇంట్లో మూడు లోకేషన్లలోనే సినిమా అంతా పూర్తి చేయడం గొప్ప విషయమని ఆర్జీవీ ట్విట్టర్ వేదికగా ‘అబ్సెషన్’ మూవీపై సందించారు. అంతేకాదు ప్రతి మహిళలో కొంతవరకు ‘నిక్కీ’ పాత్ర లక్షణాలు ఉంటాయని, ప్రతి పురుషుడు తన జీవిత భాగస్వామిలో ఆ లక్షణాలను చూస్తాడని ఆయన అభిప్రాయపడ్డారు. అదే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులకు కనెక్ట్ కావడానికి ప్రధాన కారణమని ఆయన పేర్కొన్నారు. ఇక ఈ సినిమాలో నిక్కీ పాత్రను చూస్తున్నప్పుడు ‘కౌన్’ మూవీలో ఊర్మిళ గుర్తుకు వచ్చినట్లు వర్మ చెప్పుకొచ్చారు.
అయితే వర్మను ఎక్కువగా ఆకట్టుకున్న అంశం దర్శకుడు కర్రీ బార్కర్ పనితీరే. కథ, దర్శకత్వం, ఎడిటింగ్ బాధ్యతలను ఒకేసారి నిర్వహించిన ఆయన హారర్ చిత్రాల ఫార్ములాను పూర్తిగా మార్చేశారని వర్మ ప్రశంసించారు. సాధారణంగా హారర్ సినిమాల్లో కనిపించే జంప్ స్కేర్స్పై ఆధారపడకుండా, లాంగ్ టేక్స్, సైలెన్స్, మానసిక ఒత్తిడిని పెంచే సౌండ్ డిజైన్‌ను ఉపయోగించడం ద్వారా ప్రేక్షకులను సీట్లకు కట్టిపడేశారని చెప్పారు. ఈ విజయంతో మరోసారి ఒక విషయం స్పష్టమైంది. ప్రేక్షకులను థియేటర్లకు రప్పించేది ఎప్పుడూ భారీ బడ్జెట్ కాదు. కొత్త ఆలోచన, బలమైన కథ ఉంటే ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించగలదు ఏ సినిమా అయినా. ప్రస్తుతం ‘అబ్సెషన్’ సాధించిన విజయం అదే విషయాన్ని నిరూపిస్తూ ప్రపంచ సినీ పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది.
- Tags
- cinema
- ram gopal varma
తాజావార్తలు
-
Ram Gopal Varma : పెద్ద స్లార్లకు, భారీ బడ్జెట్ డైరెక్టర్లకు RGV కౌంటర్… హాలీవుడ్ హారర్ పై వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు
-
Birth Rate: భారత్‌లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Today Gold and Silver Prices: బంగారం కొనాలనుకుంటున్నారా? తాజా గోల్డ్, సిల్వర్ రేట్లు ఇవిగో.. తగ్గాయా? పెరిగాయా?
-
Ram Charan : ‘పెద్ది’ని చూసి రామ్ చరణ్ ఎమోషనల్… వీడియో వైరల్
-
Rebal Star Fans : రెబల్ స్టార్ ఫ్యాన్స్ తో మాములుగా ఉండదు
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!