Ram Gopal Varma:కొడుకు ఎలాంటి వాడు అయినా తల్లికి మాత్రం మంచివాడే.. అందుకు తాను కూడా అతీతం కాను అంటున్నారు రామ్ గోపాల్ వర్మ తల్లి సూర్యవతి. తన కొడుకు ఏది చేసిన తనకు తప్పుగా అనిపించడంలేదని చెప్పుకొచ్చింది. మొట్టమొదటిసారి ఆమె ఒక యూట్యూబ్ ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఇక ఈ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ ..”వర్మ చిన్నప్పుడు గుడ్ బాయ్ గానే పెరిగాడు.. ఇప్పుడెలా బ్యాడ్ బాయ్ అవుతాడు. చిన్నతనం నుంచి నేను రామును అర్ధం చేసుకోలేదు. చదువు మీదనే ఎక్కువ శ్రద్ద పెట్టమని చెప్పేదాన్ని. తనకు అసలు చదువు అంటేనే ఇష్టం ఉండేది కాదు. ఇక సినిమాల విషయంలో సైతం రాము పంధానే వేరు.
ఇక అతనిని చూస్తే నాకు ఒక యోగిలా సైంటిస్ట్ లా కనిపిస్తాడు.. రాము తీసిన జీఎస్టీ సినిమా నేను, రాము కలిసి చూసాం. ఏదో ఒక బయాలజీ క్లాస్ వింటున్నట్లు అనిపించింది. ఒక డాక్టర్ ను నేను మీ ఆపరేషన్ కు థియేటర్ లోకి వస్తాను.. నన్ను చుడనివ్వండి అన్నట్లు అనిపించింది. ఇదే సినిమా మళ్లీ వేరేవారితో చూడలేను” అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె ఇంటర్వ్యూ నెట్టింట వైరల్ గా మారింది.