NTV Telugu Site icon

Ram Charan: మెగా పవర్ స్టార్ కి ఇంటర్నేషనల్ అవార్డ్…

Ram Charan

Ram Charan

ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ క్రేజ్ గ్లోబల్ రేంజ్‌కి వెళ్లిపోయింది. నాటు నాటు సాంగ్‌కి ఆస్కార్ రావడంతో తారక్, చరణ్‌ పేర్లు ప్రపంచ వ్యాప్తంగా మార్మోగిపోయాయి. స్టీవెన్ స్పీల్ బర్గ్, జేమ్స్ కామెరాన్ లాంటి హాలీవుడ్ దిగ్గజ దర్శకులు సైతం వీళ్ల యాక్టింగ్‌కు ఫిదా అయిపోయారు. అందుకే ఇద్దరికీ ఎన్నో అవార్డ్స్ వరించాయి. తాజాగా రామ్ చరణ్ ఖాతాలో మరో ఇంటర్నేషనల్ అవార్డ్ వచ్చి చేరింది. అమెరికాలో నిర్వహించే పాప్ గోల్డెన్ అవార్డ్స్… ఇండియాలోని బాలీవుడ్ యాక్టర్స్ అండ్ సినిమాలకు కూడా ఇస్తుంటారు. ఇప్పటకే ఈ అవార్డ్స్ నామినేషన్స్‌లో… రామ్ చరణ్, షారుఖ్ ఖాన్, అదా శర్మ, దీపికా పదుకొనే, రాశి ఖన్నా వంటి వారు చోటు దక్కించుకున్నారు. తాజాగా పాప్ గోల్డెన్ అవార్డ్స్ ప్రకటించారు. ఈ విష‌యాన్ని పాప్ గోల్డెన్ కమిటీ అధికారికంగా వెల్ల‌డించింది.

తెలుగు నుంచి రామ్ చ‌ర‌ణ్‌కు పాప్‌ గోల్డెన్ బాలీవుడ్ యాక్టర్ అవార్డు ద‌క్కింది. దీంతో మెగా పవర్ స్టార్ పేరు సోషల్ మీడియా టాప్ ట్రెండ్ అవుతోంది. ఇటీవల ఇచ్చిన నేషనల్ అవార్డ్స్‌లో చరణ్‌కు బెస్ట్ యాక్టర్ అవార్డ్ వస్తుందని మెగా ఫ్యాన్స్ భావించారు కానీ చరణ్, ఎన్టీఆర్‌ని కాదని అల్లు అర్జున్ బెస్ట్ యాక్టర్ అవార్డ్‌ సొంతం చేసుకున్నాడు. అయితే ఇప్పుడు… నేషనల్ అవార్డు మిస్ అయినా ఇంటర్నేషనల్ అవార్డు రావడంతో మెగా ఫ్యాన్స్‌ ఫుల్ ఖుషీ అవుతున్నారు. మరోవైపు నెట్ ఫ్లిక్స్ సీఇవో టెడ్ సరండోస్‌, రామ్ చరణ్‌ను కలవడం హాట్ టాపిక్‌గా మారింది కానీ గేమ్ చేంజర్ అప్డేట్ విషయంలోనే మెగా ఫ్యాన్స్ కాస్త అప్సెట్ అవుతున్నారు. ఇప్పటికైనా గేమ్ చేంజర్ అప్డేట్ ఇవ్వాలంటూ… కామెంట్స్ చేస్తున్నారు. మరి గేమ్ చేంజర్‌తో చరణ్ ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తాడో చూడాలి.