RRR మేనియా ప్రపంచవ్యాప్తంగా స్టార్ట్ అయ్యింది. ఇక ఇప్పటికే వేసిన ప్రత్యేక షోలను ఎన్టీఆర్, రామ్ చరణ్ తమ కుటుంబ సభ్యులతో కలిసి చూశారు. సోషల్ మీడియాలో ఎన్టీఆర్ కుటుంబం థియేటర్ వద్ద ఉన్న ఫోటోలు చక్కర్లు కొడుతున్నాయి. అర్ధరాత్రి స్క్రీనింగ్ కోసం జూనియర్ ఎన్టీఆర్ తన భార్య, పిల్లలతో వచ్చారు. చిరంజీవి కూడా RRR ప్రత్యేక స్క్రీనింగ్ కు హాజరైనట్టు తెలుస్తోంది. ఇక ఇప్పుడు రామ్ చరణ్ ఫోటోలు బయటకు వచ్చాయి. RRR సినిమాను చూసి థియేటర్ నుండి బయటికి రాగానే ఫొటోగ్రాఫర్లు రామ్ చరణ్ ఫోటోలను క్లిక్ చేసారు. ఇక అభిమానుల సందడి మామూలుగా లేదు. దీంతో చెర్రీ అభిమానులందరినీ పలకరించి, ఫోటోలకు ఫోజులిచ్చారు.
Read Also : RRR : ట్విట్టర్ రివ్యూ… సెలెబ్రిటీ టాక్ ఏంటంటే ?
RRR బృందం, తారాగణం, సిబ్బంది చూడటానికి అర్ధరాత్రి ప్రత్యేక స్క్రీనింగ్‌ను నిర్వహించిన విషయం తెలిసిందే. స్క్రీనింగ్‌కు హాజరైన రామ్ చరణ్ RRR కస్టమైజ్డ్ టోపీతో క్యాజువల్ లుక్‌లో కనిపించాడు. చెర్రీ భార్య ఉపాసన థియేటర్‌లో సినిమాను ఫుల్ గా ఎంజాయ్ చేసిందట. ఉపాసన తెరపై తన భర్త నటనను చూసి కేకలు, ఈలలు వేస్తూ సాధారణ ప్రేక్షకురాలిలా ఎంజాయ్ చేసిందట. ఇక ఇప్పటికే సినిమాను వీక్షించిన వారి నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది.
