పునీత్ రాజ్ కుమార్ ఫ్యామిలీని పరామర్శించిన రామ్ చరణ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ ఆకస్మిక విషాద మరణంతో దిగ్భ్రాంతికి లోనైన లక్షలాది మంది అభిమానులు, సినీ వర్గాలు ఇంకా షాక్ నుంచి తేరుకోలేదు. అక్టోబర్ 29న మరణించిన పునీత్ కు తెలుగు ఇండస్ట్రీ తరపు నుంచి సన్నిహితులైన బాలయ్య, ఎన్టీఆర్, చిరంజీవి, వెంకటేష్, రానా వంటి ప్రముఖులు కడసారిగా కన్నీటి నివాళులు అర్పించారు. తాజాగా రామ్ చరణ్ పునీత్ రాజ్ కుమార్ ఫ్యామిలీని పరామర్శించారు. ఈరోజు ఉదయం 11 గంటలకు పునీత్ రాజ్ కుమార్ కుటుంబాన్ని పరామర్శించిన చరణ్.. పునీత్ కుటుంబ సభ్యులను ఓదార్చడంతో పాటు, ఆయన ఫోటోకు నివాళులర్పించారు. మెగా ఫ్యామిలీకి రాజ్‌కుమార్ ఫ్యామిలీతో సాన్నిహిత్యం ఉంది. ముఖ్యంగా పునీత్ రామ్ చరణ్‌కి మంచి స్నేహితుడు. నివాళులు అర్పించిన అనంతరం రామ్ చరణ్ మీడియాతో మాట్లాడుతూ “పునీత్ మా సొంత ఫ్యామిలీ మెంబర్… ఆయనకు ఇలా జరిగిందన్న విషయాన్ని ఇంకా జీర్ణించుకోలేకపోతున్నాను. మాటలు రావట్లేదు. పునీత్ చాలా నిజాయితీ గల వ్యక్తి. అలాంటి వ్యక్తిని కోల్పోవడం నిజంగా బాధాకరం. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సంతాపం తెలియియజేస్తున్నాను. అభిమానులు నిరాశ పడొద్దు, ధైర్యంగా ఉండాలి” అని అన్నారు. ఇంకా నిన్న నాగార్జున సైతం పునీత్ రాజ్ కుమార్ కుటుంబాన్ని పరామర్శించిన విషయం తెలిసిందే.
Read Also : వివాదంలో “జై భీమ్”… ప్రకాష్ రాజ్ సీన్ పై విమర్శలు
Also Read
తాజావార్తలు
-
RCB Playing XI: గుజరాత్ టైటాన్స్‌ను దెబ్బకొట్టేందుకు ఆర్సీబీ పక్కా ప్లాన్.. టీమ్‌లో బిగ్ ఛేంజ్..
-
Premalu 2 : ప్రేమలు 2కి కథ లేదు అందుకే క్యాన్సిల్ చేసాం : నస్లీన్
-
NBK Lineup : తమిళ డైరెక్టర్ తో నందమూరి నటసింహం సినిమా ఫిక్స్?
-
IPL 2026 Final: బెంగళూరుకు బిగ్ షాక్.. గుజరాత్ టైటాన్స్‌దే ఐపీఎల్ 2026 టైటిల్?
-
Balka Suman: బాల్క సుమన్‌కు బిగ్ షాక్.. 14 రోజుల రిమాండ్ విధించిన నాంపల్లి మెజిస్ట్రేట్
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్‌తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..