మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులకు దసరా సందర్భంగా అదిరిపోయే శుభవార్త వచ్చింది. రామ్ చరణ్ నెక్స్ట్ మూవీ కన్నడ పాపులర్ డైరెక్టర్ తో ఉండనుంది. రామ్ చరణ్, ప్రశాంత్ నీల్ కాంబోలో పాన్ ఇండియా సినిమా తెరకెక్కనుంది. ఈ చిత్రానికి సంబంధించిన అఫిషియల్ అనౌన్స్మెంట్ నిన్న వచ్చింది. పండగ రోజు ఈ ప్రకటన రావడంపై మెగా అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సినిమాకి సంబంధించిన మరిన్ని వివరాలు వేచి ఉన్నాయి. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ సినిమాను డివివి దానయ్య నిర్మించబోతున్నారు. “ఆర్ఆర్ఆర్” మూవీని కూడా ఆయనే నిర్మిస్తుండడం విశేషం.
Read Also : దసరాకు సమంత డబుల్ థమాకా!
“లెజెండ్ ను కలిశాను. మరొకరితో సినిమా చేస్తున్నాను. చిరంజీవిని కలవాలనే నా చిన్నప్పటి కోరిక నెరవేరింది” అంటూ ప్రశాంత్ నీల్ పోస్ట్ చేశారు. దీంతో వీరిద్దరి సినిమా అధికారికంగా కన్ఫర్మ్ అయిపొయింది. ప్రస్తుతం రామ్ చరణ్ “ఆర్ఆర్ఆర్” సినిమా షూటింగ్ పూర్తి చేయగా, నెక్స్ట్ “ఆర్సీ 15” అంటూ శంకర్ కాంబినేషన్ లో మూవీకి సిద్ధంగా ఉన్నారన్న విషయం తెలిసిందే.
