Site icon NTV Telugu

Ram Charan: చెర్రీకి అరుదైన గౌరవం.. ఇకపై డాక్టర్ రామ్ చరణ్

Ram Charan

Ram Charan

Ram Charan to Receive Honorary Doctorate: మెగాస్టార్ చిరంజీవి నట వారసుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన రామ్ చరణ్ తేజ అతి తక్కువ సమయంలోనే తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఏర్పాటు చేసుకున్నాడు. చిరుత సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఆయన మగధీర సినిమాతోనే 100 కోట్ల కలెక్షన్లు సాధించి ఇండస్ట్రీ హిట్ సంపాదించాడు. ఇక ఆ తర్వాత అనేక సినిమాలు చేస్తూ హిట్లు అందుకుంటూ ఫ్లాపులు చవిచూస్తూ తన సినీ జర్నీని కొనసాగించాడు. ఆయన చివరిగా నటించిన ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుని గ్లోబల్ స్టార్ అయిపోయారు. అయితే ఇప్పుడు రామ్ చరణ్ తేజ్ కు మరో అరుదైన గౌరవం దక్కనుంది. అదేమిటంటే ఆయనకు గౌరవ డాక్టరేట్ ప్రధానం చేయబోతున్నారు.

Sikandar: సల్లు భాయ్ తో మురగదాస్.. ఇట్స్ అఫీషియల్

సినీ పరిశ్రమకు రామ్ చరణ్ తేజ అందించిన సేవలకు గుర్తింపుగా గౌరవ డాక్టరేట్ అందచేయనున్నారు. ఈ నెల 13వ తేదీన చెన్నైలోని పల్లవరంలోని వేల్స్ వర్చువల్ యూనివర్సిటీ స్నాతకోత్సవం వేడుక జరగనుంది, ఈ వేడుకలు యూనివర్సిటీ ఛాన్సలర్, సినీ నిర్మాత ఈసరి గణేష్ ఆధ్వర్యంలో జరగనున్నాయి. ఇక ఈ వేడుకలకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఇదే వేడుకలో ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ) అధ్యక్షుడు డీజీ సీతారాం రామ్ చరణ్ కు గౌరవ డాక్టరేట్ ను ప్రదానం చేయనున్నారని, ఈ వేడుకలకి రామ్ చరణ్ తో పాటు పలువురు ఇతర సినీ ప్రముఖులు కూడా హాజరుకానున్నారని తెలుస్తోంది. ఇక రామ్ చరణ్ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమాతో బిజీ బిజీగా ఉన్నాడు. ఇక ఈ సినిమా పూర్తయిన తరువాత ఆర్సీ 16 బుచ్చిబాబు సన దర్శకత్వంలో తెరకెక్కించనున్నారు.

Exit mobile version