Site icon NTV Telugu

Ram Charan: గల్లీ గల్లీలో ఆయన పేరు తెలియనివారు లేరు.. అది అతని క్యారెక్టర్

Charan

Charan

Ram Charan: మాస్ కా దాస్ విశ్వక్ సేన్, మిథిలా పాల్కర్ జంటగా నటించిన చిత్రం ఓరి దేవుడా. తమిళ్ హిట్ సినిమా ఓ మై కడవులే కు అధికారిక రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమాకు మాతృకకు దర్శకత్వం వహించిన డైరెక్టర్ అశ్వత్ మారి ముత్తునే దర్శకత్వం వహించాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పీవీపీ సినిమా సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో విక్టరీ వెంకటేష్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక అక్టోబర్ 21 న ఈ సినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని రాజమండ్రిలో ఆది వారం నిర్వహించారు. ఈ వేడుకకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గెస్ట్ గా హాజరయ్యాడు. ఈ సందర్భంగా రామ్ చరణ్ మాట్లాడుతూ.. చిరంజీవి, తాను సినిమాను ఎంత ప్రేమిస్తారో అందరికి తెలుసనీ, ఇలాంటి మంచి సినిమాలను ఎంకరేజ్ చేయడానికి మెగా ఫ్యాన్స్ ఎప్పుడు ముందు ఉంటారని నిరూపించారని, అందుకే తమ ఫ్యాన్స్ ను చూస్తుంటే గర్వంగా ఉందని చెప్పుకొచ్చాడు. ఇక ఈ సినిమాలో వెంకటేష్ గారు నటించారని, ఆయన కోసమైన ఈ సినిమా చూస్తానని చెప్పుకొచ్చాడు.

ఇక విశ్వక్ గురించి చెప్పాలంటే గల్లీ గల్లీలో ఆయన పేరు తెలియనివారు లేరని, అతి తక్కువ సమయంలో ఎక్కువ హిట్స్ తో అందరి గుండెల్లో..ఫలక్ నామా నుంచి రాజమండ్రి వరకు వైజాగ్ నుంచి చిత్తూరు వరకు గల్లీ గల్లీలో తనకు ఫ్యాన్స్ వున్నారని తెలిపాడు. మాట మీద నిలబడే మనుషులు అంటే తనకిష్టమని చెప్పిన చరణ్ తనకు మాట మీద నిలబడే అలవాటు ఉందని, దాన్ని విశ్వక్ లో కూడా చూశానని చెప్పుకొచ్చాడు. విశ్వక్ క్యారెక్టర్ గురించి బయట అందరికి తెలుసనీ, తప్పో ఒప్పో మాట ఇస్తే మాత్రం నిలబడాలని అన్నాడు. అందుకే విశ్వక్ పర్సనాలిటీకి తాను పెద్ద ఫ్యాన్ అని తెలిపాడు. సూపర్ స్టార్ రజినీకాంత్, చిరంజీవి, పవన్ కళ్యాణ్ సినిమాలు హిట్ అవుతాయి అవ్వకపోతాయి.. కానీ ఎల్లకాలం అందరి దృష్టిలో సూపర్ స్టార్ లుగా వుండాలంటే వ్యక్తిగతంగా ఇచ్చి మాట కోసం నిలబడ్డారు. అలా నిలబడ్దారు కాబట్టే సూపర్స్టార్ లు గా నిలిచారు. నీలో ఆ గుణం నిండుగా ఉంది అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం చరణ్ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

Exit mobile version