Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మెగాస్టార్ తనయుడుగా ఇండస్ట్రీకి పరిచయమైనా తన కష్టంతో పైకి ఎదిగి చిరంజీవి కొడుకు రామ్ చరణ్ అన్నవారి నోట రామ్ చరణ్ తండ్రి చిరంజీవి అని అనిపించుకున్నాడు. ఇక మార్చిలో రిలీజైన ఆర్ఆర్ఆర్ చిత్రంతో చరణ్ రేంజ్ మారిపోయింది. రామరాజుగా చరణ్ ను చూసి బాలీవుడ్ మొత్తం రాముడిగా కొలవడం ప్రారంభించింది అంటే అతిశయోక్తి కాదు. ఇక మన గురించి ఇండియా ఒక్కట్టే మాట్లాడుకుంటే ఏం ఉంటుంది.. ప్రపంచమంతా మాట్లాడుకోవాలా అని దర్శకధీరుడు రాజమౌళి ఆర్ఆర్ఆర్ ను జపాన్ లో రిలీజ్ చేస్తున్నారు. అక్టోబర్ 21 న ఈ సినిమా జపాన్ లో గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది.
ఇక ఇప్పటికే ఆర్ఆర్ఆర్ త్రయం జపాన్ లో ప్రమోషన్స్ మొదలుపెట్టేసింది. కాగా, జపాన్ లో రామ్ చరణ్ క్రేజ్ చూస్తే పిచ్చెక్కిపోతోంది. రామరాజు కటౌట్స్ ను, ఫోటోలను పట్టుకొని జపాన్ యువత చరణ్ కు ఘనంగా స్వాగతం పలికింది. అంతేకాకుండా జపాన్ యువతులు తెలుగు నేర్చుకొని మరీ చరణ్ కు స్వాగతం పలకడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. “అందరికి నమస్కారం.. రామ్ చరణ్ మీరంటే మాకు ఎంతో ఇష్టం.. మిమ్మల్ని జపాన్ కు సాదరంగా ఆహ్వానిస్తున్నాం. వి ఆర్ ఆల్ లవ్ యూ” అని ముద్దుగా తెలుగులో మాట్లాడిన తీరు ఆకట్టుకొంటుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు, వీడియో నెట్టింట వైరల్ గా మారాయి. ఇండియాను మొత్తం షేక్ చేసిన ఈ సినిమా జపాన్ లో ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలంటే మరో మూడు రోజులు ఆగాల్సిందే.
