Site icon NTV Telugu

Peddi: వాయిదా లేదు.. పెద్ది ఆన్ ట్రాక్

Ram Charan, Peddi, Buchi Babu Sana

Ram Charan, Peddi, Buchi Babu Sana

ఆర్ఆర్ఆర్ (RRR) తర్వాత రామ్ చరణ్ తేజ హీరోగా నటిస్తున్న సినిమా ‘పెద్ది’. ‘ఉప్పెన’ తర్వాత బుచ్చిబాబు డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. దానికి తగ్గట్టుగానే, సినిమా నుంచి రిలీజ్ అవుతున్న ప్రతి ప్రమోషనల్ స్టఫ్ సినిమా మీద అంచనాలను మరింత రెట్టింపు చేసేలా ఉంటున్నాయి. అయితే, ఈ సినిమా వాయిదా పడుతుందని ముందు నుంచి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతానికి ఈ సినిమా ఏప్రిల్ 30వ తేదీన రిలీజ్ అవుతుందని చివరిగా ప్రకటించారు. అయితే ఆ రోజు కూడా సినిమా రిలీజ్ అవ్వడం కష్టమేనా అనే ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతోంది. తాజాగా టీం నుంచి అందుతున్న సమాచారం మేరకు, ఈ సినిమా వాయిదా పడడం లేదని అంటున్నారు.

Also Read :Summer Heroines : సమ్మర్ రేసులో హీరోయిన్ల మధ్య గట్టి పోటీ

ఈ సినిమాకి సంబంధించి కొంత ప్యాచ్ వర్క్ తో పాటు, స్పెషల్ సాంగ్ మాత్రమే పెండింగ్ ఉంది. ప్రస్తుతానికి రామ్ చరణ్ తేజ అయ్యప్ప స్వామి దీక్షలో ఉన్నారు. ఈ దీక్షలో ఉండగా స్పెషల్ సాంగ్ చేయలేరు కాబట్టి, ప్రస్తుతానికి ఆ సాంగ్ చేయడం లేదు. రామ్ చరణ్ అయ్యప్ప దీక్ష పూర్తయిన వెంటనే ఆ సాంగ్ షూట్ చేయబోతున్నారు. మరోపక్క బుచ్చిబాబు ప్యాచ్ వర్క్ ఫినిష్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాని ఏప్రిల్ 30వ తేదీన గ్రాండ్ స్కేల్లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా యుఎస్ (US) బుకింగ్స్ కూడా అదే రోజు ఓపెన్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ‘పెద్ది’ పోస్ట్‌పోన్ అయ్యే అవకాశం ఉందంటూ జరుగుతున్న ప్రచారానికి టీం బ్రేకులు వేసినట్లే!

Exit mobile version