Peddi: వాయిదా లేదు.. పెద్ది ఆన్ ట్రాక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆర్ఆర్ఆర్ (RRR) తర్వాత రామ్ చరణ్ తేజ హీరోగా నటిస్తున్న సినిమా ‘పెద్ది’. ‘ఉప్పెన’ తర్వాత బుచ్చిబాబు డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. దానికి తగ్గట్టుగానే, సినిమా నుంచి రిలీజ్ అవుతున్న ప్రతి ప్రమోషనల్ స్టఫ్ సినిమా మీద అంచనాలను మరింత రెట్టింపు చేసేలా ఉంటున్నాయి. అయితే, ఈ సినిమా వాయిదా పడుతుందని ముందు నుంచి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతానికి ఈ సినిమా ఏప్రిల్ 30వ తేదీన రిలీజ్ అవుతుందని చివరిగా ప్రకటించారు. అయితే ఆ రోజు కూడా సినిమా రిలీజ్ అవ్వడం కష్టమేనా అనే ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతోంది. తాజాగా టీం నుంచి అందుతున్న సమాచారం మేరకు, ఈ సినిమా వాయిదా పడడం లేదని అంటున్నారు.
Also Read :Summer Heroines : సమ్మర్ రేసులో హీరోయిన్ల మధ్య గట్టి పోటీ
Also Read
- SS Rajamouli: బాహుబలి ‘కిలికి’ని మించేలా జక్కన్న సరికొత్త ప్రయోగం.. !
- Nana Patekar: కార్గిల్ వార్‌లో నానా పటేకర్.. అల్విదా నానా భాయ్!
- God of War: ఎన్టీఆర్ ప్రాజెక్ట్‌పై త్రివిక్రమ్ నిర్లక్ష్యం? 'గాడ్ ఆఫ్ వార్' సంగతేంటి!
- Alias Rukmini: నితిన్‌ను ట్రాక్‌లోకి తెచ్చేందుకు నాని మాస్టర్ ప్లాన్.. రేపు ఉదయం 10:08కి బిగ్ బ్లాస్టింగ్ అప్‌డేట్!
ఈ సినిమాకి సంబంధించి కొంత ప్యాచ్ వర్క్ తో పాటు, స్పెషల్ సాంగ్ మాత్రమే పెండింగ్ ఉంది. ప్రస్తుతానికి రామ్ చరణ్ తేజ అయ్యప్ప స్వామి దీక్షలో ఉన్నారు. ఈ దీక్షలో ఉండగా స్పెషల్ సాంగ్ చేయలేరు కాబట్టి, ప్రస్తుతానికి ఆ సాంగ్ చేయడం లేదు. రామ్ చరణ్ అయ్యప్ప దీక్ష పూర్తయిన వెంటనే ఆ సాంగ్ షూట్ చేయబోతున్నారు. మరోపక్క బుచ్చిబాబు ప్యాచ్ వర్క్ ఫినిష్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాని ఏప్రిల్ 30వ తేదీన గ్రాండ్ స్కేల్లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా యుఎస్ (US) బుకింగ్స్ కూడా అదే రోజు ఓపెన్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ‘పెద్ది’ పోస్ట్‌పోన్ అయ్యే అవకాశం ఉందంటూ జరుగుతున్న ప్రచారానికి టీం బ్రేకులు వేసినట్లే!
తాజావార్తలు
-
SS Rajamouli: బాహుబలి ‘కిలికి’ని మించేలా జక్కన్న సరికొత్త ప్రయోగం.. !
-
Nana Patekar: కార్గిల్ వార్‌లో నానా పటేకర్.. అల్విదా నానా భాయ్!
-
Christa Pike: మరణశిక్ష కోసం 2-సార్లు విషపు ఇంజెక్షన్లు.. అయినా, క్రిస్టా పైక్ ఎలా బతికింది.?
-
Nara Lokesh : ఏపీలో దుర్గాదేవి మండపాలకు మంత్రి నారా లోకేష్ తీపి కబురు
-
Saudi-Houthi: మరింత దూకుడు పెంచిన హౌతీలు.. రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడి!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!