Peddi : ‘పెద్ది’ వాయిదాకి అసలు కారణం తెలిస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘పెద్ది’ విడుదల కోసం కళ్ళల్లో వత్తులు వేసుకుని ఎదురుచూస్తున్న అభిమానులకు చిత్ర యూనిట్ ఊహించని షాక్ ఇచ్చింది. ముందుగా అనుకున్న ప్రకారం ఈ చిత్రం ఏప్రిల్ 30న థియేటర్లలో సందడి చేయాల్సి ఉంది. కానీ, తాజా సమాచారం ప్రకారం ఈ మూవీ జూన్ 2026కు వాయిదా పడింది. అయితే, ఈ ఆలస్యం వెనుక ఉన్న కారణాలు ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరగడానికి ప్రధాన కారణం ఇందులోని విజువల్ ఎఫెక్ట్స్. ఈ చిత్రానికి VFX బాధ్యతలు నిర్వహిస్తున్న ‘ఫ్రేమ్ ఎక్స్’ సంస్థ అధినేత నీలేష్ ఇటీవల కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. సినిమాలో వచ్చే రెజ్లింగ్ సన్నివేశాలు ప్రేక్షకులకు ఒక సరికొత్త అనుభూతిని ఇస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కేవలం 4 నుంచి 5 నిమిషాల నిడివి గల ఈ రెజ్లింగ్ సీక్వెన్స్ కోసం ఏకంగా మూడు నెలల సమయం కేటాయించారంటే, ఆ సన్నివేశం ఎంత గ్రాండ్‌గా ఉండబోతుందో అర్థం చేసుకోవచ్చు. ప్రతి ఫ్రేమ్‌ను ఎంతో క్షుణ్ణంగా పరిశీలిస్తూ, అత్యున్నత నాణ్యతతో తీర్చిదిద్దుతున్నట్లు ఆయన పేర్కొన్నారు.
Also Read : Kara: ఏప్రిల్ 30న తెలుగులో ధనుష్ ‘కర’ రిలీజ్
Also Read
- Hanuman Ansh: ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘హనుమాన్ అంశ్’ వచ్చేస్తోంది.. తెలుగు రిలీజ్ ఎప్పుడంటే?
- Adarsha Kutumbam: 'ఆదర్శ కుటుంబం'.. ఆ రూమర్లు నిజమేనా?
- RC17 : రామ్ చరణ్ - సుకుమార్ సినిమా షూటింగ్, రిలీజ్‌కు పక్కా ప్లాన్
- Jayant C Paranjee: ఆడదని ముందే తెలుసు.. పవన్ కళ్యాణ్ సినిమాపై డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు!
ఒక నిమిషం ఫుటేజీలో సుమారు 1440 ఫ్రేమ్‌లు ఉంటాయి. ప్రతి ఫ్రేమ్‌ను ఎన్హాన్స్ చేయడానికి పట్టే సమయం, ఖర్చు ఆ సీన్ యొక్క ప్రాముఖ్యతపై ఆధారపడి ఉంటుంది. సినిమా షూటింగ్ చివరి దశలో ఉండటంతో పాటు, భారీ స్థాయిలో ఉన్న VFX వర్క్ పూర్తి కావడానికి మరికొంత సమయం అవసరమని చిత్ర బృందం భావించింది. సాధారణంగా సినిమా వాయిదా పడితే అభిమానులు నిరాశ చెందుతారు. కానీ, ‘పెద్ది’ విషయంలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. ఇదొక స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా కావడంతో, క్రీడలకు సంబంధించిన సన్నివేశాలు సహజంగా ఉండటం చాలా ముఖ్యం. ఏమాత్రం రాజీ పడకుండా ప్రేక్షకులకు ఒక విజువల్ వండర్‌ను అందించాలనే ఉద్దేశంతోనే మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నారు. నిర్మాతలు చూపిస్తున్న ఈ అంకితభావం చూస్తుంటే, థియేటర్లలో మెగా పవర్ స్టార్ విధ్వంసం మామూలుగా ఉండదని అర్థమవుతోంది. జూన్ 2026లో ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి!
తాజావార్తలు
-
Hanuman Ansh: ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘హనుమాన్ అంశ్’ వచ్చేస్తోంది.. తెలుగు రిలీజ్ ఎప్పుడంటే?
-
Smit Machchhar: ఆ టైమ్‌లో “హనుమాన్ చాలీసా” పఠించాను.. ఆ దేవుడే నన్ను కాపాడాడు..
-
Vettri Payanam: మహిళలకు గుడ్‌న్యూస్.. ఉచిత బస్సు ప్రయాణం విస్తరణ.. ఎక్స్‌ప్రెస్, డీలక్స్ బస్సులకూ వర్తింపు
-
Anant Ambani in AP: నన్ను కూడా ఆంధ్ర బిడ్డగా భావించండి.. అనంత్ అంబానీ ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Shoaib Malik Fourth Marriage Rumours: 44 ఏళ్ల షోయబ్ మాలిక్ నాలుగో పెళ్లి వార్తలు..! నిజమెంత?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?