Peddhi: ‘పెద్ది’ నుండి చికిరిచికిరి సాంగ్ రిలీజ్ డేట్ ఫిక్స్.. అదిరిపోయే ట్యూన్‌తో హైప్ పెంచిన ప్రోమో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ “పెద్ది” నుంచి ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న ఫస్ట్ సాంగ్ అప్‌డేట్ వచ్చింది. మేకర్స్ ఒక బిగ్ సర్‌ప్రైజ్‌గా ‘చికిరి’ అంటూ సాగే ఫస్ట్ లిరికల్ సాంగ్ రిలీజ్ డేట్‌ని ప్రకటించారు. ఈరోజు (నవంబర్ 5) విడుదల చేసిన ప్రోమో వీడియోలో సాంగ్ బ్యాక్‌గ్రౌండ్ ట్యూన్ తో పాటు రామ్ చరణ్ యొక్క ఎనర్జిటిక్ హుక్ స్టెప్ ఫ్యాన్స్‌ని ఉర్రూతలూగిస్తోంది. “చికిరి” పాటను ..
Also Read : Aamir Khan: రోజుకు వంద పాన్లు తిన్న ఆమిర్ ఖాన్.. కారణం వింటే షాక్ అవుతారు!
Also Read
- Janvi Kapoor : 'అచ్చియమ్మ' కూడా అచ్చి రాలేదే!
- Hema : షూటింగ్లకే మూడ్ ఉండదు.. పవన్ కళ్యాణ్‌ను విమర్శిస్తారా?
- Upcoming K-Dramas : సస్పెన్స్ నుంచి రొమాంటిక్ దాకా... జూన్ లో చూడవలసిన 6 కొత్త కె-డ్రామాలు
- Chiranjeevi: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న చిరంజీవి ట్వీట్..'తండ్రిగా మాత్రమే కాదు.. నటుడిగా కూడా గర్వపడుతున్నా'
నవంబర్ 7న గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నట్టు టీమ్ ప్రకటించింది. ఈ సినిమాకి ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు. అయితే ఇక పాట గురించి వీడియోలో దర్శకుడు బుచ్చిబాబు సానా, ఇంకా రెహమాన్ మాట్లాడుకోగా.. పెద్ది గాడు (రామ్ చరణ్) తన గ్రామంలో హీరోయిన్ (జాన్వీ కపూర్)ను మొదటిసారి చూసే సందర్భంలో ఈ పాట వస్తుందట. ఆ క్షణంలో హీరో మనసులో కలిగిన భావాలను పదాల్లో మార్చినట్టుగా “కాటుక అక్కర్లేని కళ్లు, ముక్కుపుడక అక్కర్లేని ముక్కు, అలంకరణ అక్కర్లేని అరుదైన చికిరిరా ఈ చికిరి” అనే లైన్ లో రావాలి అంటూ బుచ్చిబాబు వివరణ ఇవ్వగా.
రెహమాన్ ఈ లైన్ విన్న వెంటనే “చికిరి అంటే ఏమిటి?” అని అడిగితే, బుచ్చిబాబు “మా ఊరిలో ముద్దుగా, అందంగా ఉన్న అమ్మాయిని ‘చికిరి’ అని పిలుస్తారు” అని చెప్పారు. అప్పుడు రెహమాన్ అదే పదం మీద సాంగ్ చేయాలని నిర్ణయించుకున్నారట. ప్రోమో చివరలో రామ్ చరణ్ నోటిలో బీడీతో చేసే మాస్ హుక్ స్టెప్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ ఒక్క సీన్ చూసిన ఫ్యాన్స్ “ఇదే చరణ్ స్టైల్!” అంటూ ఫిదా అవుతున్నారు. పెద్ది సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, గ్లింప్స్ సినిమాపై భారీ అంచనాలు సెట్ చేయగా.. తాజాగా విడుదలైన సాంగ్ అప్ డేట్ మరింత బజ్ తెచ్చింది.
తాజావార్తలు
-
Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
-
Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
-
Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
-
Peddi: బుక్ మై షోలో సరికొత్త రికార్డు.. చరణ్ కెరియర్లోనే బిగ్గెస్ట్ ఓపెనర్‌గా ‘పెద్ది’?
-
Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్‌లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్‌ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!