Site icon NTV Telugu

RC 15: అలా వచ్చాడో లేదో ఇలా మొదలుపెట్టేసాడు

Rc 15

Rc 15

ఆస్కార్ ఈవెంట్ కోసం యుఎస్ వెళ్లిన రామ్ చరణ్ తేజ్ ఇటివలే ఇండియా తిరిగొచ్చాడు. డైరెక్ట్ గా న్యూ ఢిల్లీలో ల్యాండ్ అయిన ఎన్టీఆర్, దేశ రాజధానిలో ఆర్ ఆర్ ఆర్ సినిమా ప్రతినిధిగా మీడియాతో మాట్లాడాడు. ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్న చరణ్ ని మెగా అభిమానులు గ్రాండ్ గా వెల్కమ్ చెప్పారు. బేగంపేట్ ఎయిర్పోర్ట్ నుంచి చరణ్ ఇంటి వరకూ భారి ర్యాలీ జరిగింది. హైదరాబాద్ కి వచ్చి ఒక్క రోజు కూడా అవ్వలేదు అప్పుడే చరణ్ RC 15 వర్క్స్ మొదలుపెట్టేసాడు. క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో చరణ్ చేస్తున్న ఈ పాన్ ఇండియా మూవీపై భారి అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీని ఆర్ ఆర్ ఆర్ ఆస్కార్ ప్రమోషన్స్ కోసం హోల్డ్ చేశారు. ఆస్కార్ ఈవెంట్ అయిపోవడంతో హైదరాబాద్ వచ్చిన చరణ్, రాగానే RC 15 సాంగ్ షూటింగ్ కి రెడీ అయ్యాడు. 400 మంది డాన్సర్స్ తో కియారా అద్వానీ, చరణ్ పైన డిజైన్ చేసిన ఈ సాంగ్ కి ప్రభుదేవా డాన్స్ కంపోజ్ చేస్తున్నాడు.

Read Also: Vishwak Sen: మాస్ కా దాస్ కొత్త సినిమా స్టార్ట్ చేశాడు…

ఇండియాకి ఆస్కార్ తీసుకోని రావడంతో తమ వంతు రోల్ ప్లే చేసిన ఖొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్, హీరో రామ్ చరణ్ లని అభినందిస్తూ ప్రభుదేవా నాటు నాటు హుక్ స్టెప్ వేశాడు. గజమల వేసి, కేక్ కట్ చేసిన RC 15 సెట్స్ లో 400 మంది మధ్యలో రామ్ చరణ్, ప్రభుదేవా, ప్రేమ్ రక్షిత్ లు నాటు నాటు సాంగ్ ని సెలబ్రేట్ చేసుకున్నారు. ఇదిలా ఉంటే మార్చ్ 27న రామ్ చరణ్ తేజ్ పుట్టిన రోజు సంధర్భంగా RC 15 టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ తో పాటు ఒక గ్లింప్స్ ని కూడా రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది. చరణ్ బర్త్ డే రోజున టైటిల్ అన్నౌన్స్ చేసి పాన్ ఇండియా ప్రమోషన్స్ ని ఇక్కడి నుంచే మొదలుపెట్టాలని దిల్ రాజు అండ్ టీం ప్లాన్ చేస్తున్నారు. మరి శంకర్ పాన్ ఇండియా అభిమానులకి ఎలాంటి సర్ప్రైజ్ ఇస్తాడో చూడాలి.

 

Exit mobile version